Hey This Is Yasin And Welcome To YouTube Channel Technical And Local News.. Here You Will Find A Lot Of Video's Related To Technology And Update News...




YSN NEWS6

జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో ఎప్పటిలాగే కొనసాగుతున్న బి ఆర్ ఆక్స్ఫర్డ్ హవా

కందుకూరు ఫిబ్రవరి 17:-

సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ (2026) session-1 ఫలితాలలో.. కందుకూరు
బిఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి & మెడికల్ అకాడమీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలోనే అత్యుత్తమ పర్సంటైల్స్ సాధించి గర్వకారణంగా నిలిచారని బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు తెలిపారు. మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అత్యుత్తమ పర్సంటైల్స్ సాధించిన మా విద్యార్థులు...బొల్లినేని కార్తీక్ నాయుడు జిల్లాలోనే అత్యుత్తమంగా..
టౌన్ లో మొదటి స్థానంలో (99.76)పర్సంటైల్ సాధించాడని తెలిపారు.అదే విధంగా..మానికొండ హర్షిత్ చౌదరి (98.96),ఆర్.యశస్వి కుమార్ (96.54), పి. లోకేష్ (94.52),యన్ వి అర్యేంద్ర (93.38),కే.శశికళ (92.88),
ఆర్.నాగ సాయి (92.22),సీహెచ్.భవ్యశ్రీ(91.94),ఎల్. లిఖిత సాయి శ్రీ (91.69),జి రాజేశ్వరి (90.11),ఆర్. తరుణ్ (89.88),యస్.వాసవి (89.83)పర్సంటైల్స్ తో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. అంతేకాకుండా జేఈఈ అడ్వాన్స్డ్ కి 30 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆ విద్యార్థిని, విద్యార్థులను,తల్లిదండ్రులను, అధ్యాపక సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి.బాల భాస్కరరావు, బి.నరేంద్ర బాబు, ప్రిన్సిపాల్స్ అబ్బూరి వెంకటేశ్వర్లు,షాహుల్ హమీద్, ఇర్ఫాన్,వెంకటరావు,ఇంచార్జి వెంకారెడ్డి,తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

2 days ago | [YT] | 2

YSN NEWS6

*స్టేట్ ఫస్ట్ సాధించిన బి ఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థి కనమర్లపూడి వెంకట సౌరిష్*


కందుకూరు ఫిబ్రవరి 05:-


విజయవాడ ఇందిరా గాంధీ ఫుట్ బాల్ స్టేడియంలో జరిగిన "ఖేలో ఇండియా యన్ టి పి సి అమరావతి సిటీ ఓపెన్ ఆర్చరీ టోర్నమెంట్" అండర్-15 ఇండియన్ విభాగంలో ప్రకాశం జిల్లా తరఫున పాల్గొన్న కందుకూరు బిఆర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కనమర్లపూడి వెంకట సౌరిష్
స్టేట్ ఫస్ట్ సాధించాడు.ఈ సందర్భంగా బి.ఆర్. ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు మాట్లాడుతూ.. ఇలాంటి విజయాలు విద్యార్థులలో పట్టుదలను పెంచి ఉన్నత స్థానానికి చేరుకోవడానికిదోహదపడతాయన్నారు.డైరెక్టర్ బాల భాస్కరరావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తితో ఉంటే ఆత్మవిశ్వాసంతో చదువులోనూ రాణించగలరని పేర్కొన్నారు. స్టేట్ ఫస్ట్ సాధించిన కనమర్లపూడి వెంకట సౌరిష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ బి.నరేంద్ర బాబు,పాఠశాల డీన్, ప్రిన్సిపాల్స్, తదితర ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

2 weeks ago | [YT] | 1

YSN NEWS6

*నిజాయితీగల మహిళను అభినందించిన పట్టణ ఎస్ఐ శివ నాగరాజు*



కందుకూరు, YSN NEWS6 నవంబర్ 18:-


గుడ్లూరు మండలం చెమిడిది వాడుకు చెందిన గద్దె సువార్తమ్మ కు కందుకూరు పట్టణంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ సమీపంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక బంగారు గొలుసు దొరికింది. వెంటనే ఈరోజు ఆ చైన్ ను కందుకూరు పట్టణ ఎస్సై శివనాగరాజుకు ఆమె అందజేశారు. ఆమె నిజాయితీని ఎస్సై అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివ నాగరాజు మాట్లాడుతూ ఇలాంటి నిజాయితీగల వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. అదేవిధంగా చేను పోగొట్టుకున్న వారు కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో తనను సంప్రదించమని తెలిపారు.

3 months ago | [YT] | 2

YSN NEWS6

*టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డిగ్రీ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్స్*


కందుకూరు YSN NEWS6 నవంబర్ 18:-


టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు డిగ్రీ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ ఒక ప్రకటన తెలియజేశారు. కళాశాలలో స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ పొందాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సరే తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు రెండు సెట్స్ జిరాక్స్ కాపీలతో ఈనెల 21వ తారీకు లోపు కళాశాలలో సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. రిజిస్ట్రేషన్ కొరకు 500 రూపాయలు చెల్లించాలని తెలియజేశారు. కావున స్పాట్ అడ్మిషన్ ద్వారా కళాశాలలో చేరాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు వెంటనే టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని తెలియజేశారు.

3 months ago | [YT] | 1

YSN NEWS6

*పోగొట్టుకున్న బంగారు చైనును సంబందిత మహిళకు అందజేసిన కందుకూరు పట్టణ యస్.ఐ పులి శివ నాగరాజు*

కందుకూరు YSN NEWS6 :-

గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామానికి చెందిన గద్దె సువార్తమ్మ కు కందుకూరు పట్టణంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ సమీపంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక బంగారు గొలుసు దొరికింది.ఈరోజు ఆ చైన్ ను కందుకూరు పట్టణ ఎస్సై శివనాగరాజుకు ఆమె అందజేశారు. ఆమె నిజాయితీని ఎస్సై అభినందించారు. కందుకూరు టౌన్ యస్.ఐ గారు వాట్సాప్ గ్రూపులలో ఇచ్చిన ప్రకటనను చూసిన చైను పోగొట్టుకున్న వారు అయిన గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామానికి చెందిన గంగోలు లక్ష్మీ ప్రసన్న నిన్న అనగా ది. 17.11.2025వ తేదీ సాయంత్రం తాను చెమిడిద పాడు నుండి కందుకూరు వచ్చి బస్సు దిగిన కొద్దిసేపటి తర్వాత తన మెడలో ఉండవలసిన సుమారు 1 1/2 సవర బంగారు చైను ఎక్కడో పడిపోయినట్లుగా గుర్తించి ఎంత వెతికినా కనబడనట్లు, ఎస్సై గారు వాట్సాప్ గ్రూపులలో ఇచ్చిన ప్రకటనను చూసి వచ్చినట్లు తెలిపి తన బంగారు చైనుకు సంబంధించిన సరియైన వివరాలు తెలియపరచగా కందుకూరు పట్టణ ఎస్ఐ పులి శివ నాగరాజు గారు పరిశీలించి బాధితురాలికి ఆమె యొక్క చైనుని అందజేశారు. ఈ సందర్భంగా బాదిత మహిళ అయిన గంగోలు లక్ష్మీ ప్రసన్న కందుకూరు పట్టణ ఎస్ఐ గారికి మరియు గద్దె సువార్తమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు.

3 months ago | [YT] | 0

YSN NEWS6

BR OXFORD స్కూల్ లో కార్తీక మాస పూజలు...

కందుకూరు YSN NEWS6 :-

కందుకూరు పట్టణం లోని స్థానిక పామూరు రోడ్ నందు ఉన్న *బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ ఒలంపియాడ్ పాఠశాల* లో కార్తీక సోమవారం సందర్భంగా సోమవారం కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నిష్టతో దీపాలు వెలిగించి శివలింగాన్ని పూలతో అలంకరించి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా *బి.ఆర్ ఆక్స్ఫర్డ్* విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు మాట్లాడుతూ..కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని,అలాగే విద్యార్థులు చిన్ననాటి నుండే ఆధ్యాత్మికత అలవర్చుకోవాలని తెలిపారు. విద్యాసంస్థల డైరెక్టర్ జి.బాల భాస్కరరావు మాట్లాడుతూ.. కార్తీక సోమవారాలు పరమశివునికి ప్రీతికరమైన రోజులని ఈ మాసంలో చేసే పూజలకి, దానాలకు పుణ్యం లభిస్తుందని తెలిపారు.విద్యార్థులు చిన్ననాటి నుండే దానగుణం కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ బి.నరేంద్రబాబు డీన్,ప్రిన్సిపాల్స్,తదితర ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

3 months ago | [YT] | 0

YSN NEWS6

*మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి*

*ఇంటూరి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు*

కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు

భారీ గజమాలతో మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు

పార్టీ జెండాలు, పుష్పగుచ్ఛాలు, జై తెలుగుదేశం నినాదాలతో మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం

ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్ గారు

ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, ఫోటోలు దిగుతూ ముందుకు సాగిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ...

3 months ago | [YT] | 1

YSN NEWS6

*మంత్రి నారా లోకేష్ గారితో కలిసి దివంగత మాలేపాటి సుబ్బానాయుడు గారి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆగ్రోస్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్‌గా సేవలందించిన దివంగత మాలేపాటి సుబ్బానాయుడు గారి కుటుంబ సభ్యులను ఈరోజు ఉదయం రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు పరామర్శించారు.

కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ గారితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాస యాదవ్ గారు, నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ యన్. ఎం.డి. ఫరూక్ గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

దివంగత మాలేపాటి సుబ్బానాయుడు గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, సుబ్బానాయుడు గారితో తనకు ఉన్న ఆప్యాయ అనుబంధాన్ని స్మరించుకున్నారు.

3 months ago | [YT] | 0

YSN NEWS6

Thank You So Much Support My Subscribers


Please Watch Every Video and Like and Share.


Subscribe. Chanel

@ysn news6
#ysn news6
#subcribe
#like
#share

3 months ago | [YT] | 0

YSN NEWS6

*గుడ్లూరు మండలంలో జరిగిన దుర్ఘటన చాలా బాధించింది....*

*నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీస్ అధికారులకు ఆదేశాలు..*

*మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం...*

*మృతుని భార్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తాం: ఎమ్మెల్యే ఇంటూరి..*


కందుకూరు అక్టోబర్ 17:-


ఇటీవల గుడ్లూరు మండలంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని శుక్రవారం సాయంత్రం దారకానిపాడు గ్రామంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించారు...

ఈ సందర్భంగా గూడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో ఈ నెల 2వ తేదీన జరిగిన దుర్ఘటనకు పాల్పడిన నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షపడేలా చూడాలని పోలీస్ అధికారులు ఆ రోజునే ఆదేశించానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు...
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్గవ్, పవన్ లకు మెరుగైన వైద్యం అందించేలా చూస్తానని వారి కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్యకు ఏదైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగాన్ని ఇచ్చి వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు...

ఈ ఘటనకు కొంతమంది రాజకీయ రంగు పులుముతున్నారని, నియోజకవర్గంలో శాంతి భద్రత విషయంలో రాజీ లేదని , తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు... రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదేల పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో రాజీ లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు..

ఇప్పటికే ఈ కేసులో నిందితులైన కాకర్ల హరిచంద్ర ప్రసాద్, కాకర్ల మాధవరావు లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారని వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులు ఆదేశించారు..

ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాని కోటేశ్వరరావు, జనసేన నాయకులు గోకరాజు మదన్, అన్నంగి చలపతి, మూలగిరి శీను, కొణిదేల శీను శిగా తిరుపాలు, వంశి మండలములోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

4 months ago | [YT] | 1