నమస్కారం,
నా పేరు గాయత్రి దేవి. నా ఛానల్ పేరు గాయత్రి క్రియేషన్స్ . నేను ఉపాద్యాయ వృత్తిలో వుండే దాన్ని. ఇన్నేళ్ళ నా జీవితానుభవo లో నేను నేర్చు కున్న అనేక విషయాలను నలుగురితో పంచుకోవాలనే కోరికతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కథలు చదవడం అన్నా వ్రాయడం అన్నా నాకు చాల ఇష్టం . నేను నలబై కథల వరకు వ్రాశాను. ౩౦ కథలు కర్నూల్ రేడియోలో ప్రశారమైనా యి . ముఖ్యంగా చందమామ కథలు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి యువతకు చూడటం తప్ప చదివే అలవాటు తగ్గిపోయింది.అందువల్ల వినిపించే కథల రూపంలో చందమామ కథలు, మారి కొందరి కథలు, నా కథలు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను.
అలాగే మన ఛానల్ లో వివిధ రకాల ఎన్నో రుచికరమైన శాఖాహరమైన వంటలను చూడవచ్చు మరియు నేర్చుకోవచ్చు.కొత్తగా వివాహం చేసుకున్న వారికి అలాగే గృహిణి లాకు బ్యాచులర్స్ కి వంట నేర్చుకోవాలను కునే వరెందరికో మన ఛానల్ ఒక చక్కటి మార్గం.
నా కథలను వింటూ వానలు చూస్తూ, నేర్చుకుంటూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ........
Gayathri Creations
సింద్బాద్ అద్భుత యాత్రలు :-www.youtube.com/playlist?list...
బస్రాకు చెందిన సిద్బాద్ అరేబియన్ నైట్స్ కథలలో అత్యంత ప్రసిద్దమైననది. సాహసవంతుడైన సింద్బాద్ తన ఏడు ప్రయాణాలలో ఎదురైనా వింత అనుభవాలు, సముద్ర రాక్షసులు, నిధులు మరియు అద్భుతమైన దీవుల గురించి ఈ కథలు వివరిస్తాయి. ఇదిప్రమాదాలను దైర్యం తో ఎదుర్కొని ఎలా విజయవంతం కావాలో భోధిస్తుంది.సింద్బాద్ సముద్ర ప్రయాణాలు అన్ని మన ఛానల్ లో వున్నాయి. మీరు విని ఆనందించి అలాగే like share comment and subscribe చేయగలరని ఆశిస్తున్నాను ధన్యవాదాలు మీ గాయత్రీ చంద్రశేఖర్
5 hours ago | [YT] | 2
View 2 replies
Gayathri Creations
అందరికీ శుభోదయం
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
మీ గాయత్రీ చంద్రశేఖర్ ,గాయత్రి క్రియేషన్స్
1 day ago | [YT] | 3
View 4 replies
Gayathri Creations
చందమామ కథలు :-link:-www.youtube.com/playlist?list...
చందమామ కథలు తెలుగు సాహిత్యంలో పిల్లలకు, పెద్దలకు అత్యంత ఆదరణ పొందిన నీతి కథలనిది. 1947 లో ప్రారంభమైన ఈ మాసపత్రిక, సరళమైన భాష, ఆసక్తికరమైనజానపద, పౌరాణిక కథలు, మరియు చక్కటి చిత్రాలతో విజ్ఞానాన్ని, విలువలను అందించింది. ఆకాలంలో చిన్నారులకు ఇది ఒక మధురమైన జ్ఞాపకం.చందమామ కథల ముఖ్య అంశాలు, ప్రతి కథలో ఒక నీతి, నిజాయితీ మరియు మంచితనం గురించి తెలుపుతుంది. చిన్నచిన్న పదాలు, అర్ధవంతమైన వాడుక, మరియు అవ్వా తాతల కాలం నాటి శైలిలో కథలు ఉంటాయి . జానపద కథలు, చారిత్రక అంశాలు, మరియు విక్రమార్క బేతాళ కథలు వంటివి ప్రాచుర్యం పొందాయి. కథలను అర్ధం చేసుకోవడానిక వీలుగా చక్కని బొమ్మలతో ప్రచురించేవారు . ఈ కథలన్నీ మన ఛానల్ లో వున్నాయ. మీరు విని ఆనందించగలరని ఆశిస్తున్నానుఅలాగే like share comment and subscribe చేయగలరని ఆశిస్తున్నాను, ధన్యవాదాలు గాయత్రీ చంద్రశేఖర్
2 days ago | [YT] | 3
View 2 replies
Gayathri Creations
రాజుల కథలు :-www.youtube.com/playlist?list...
తెలుగుతో రాజుల కథలు సాధారణగా "అనగనగా ఒక రాజు"..... లేదా "పూర్వం ఒకనొక దేశాన్ని రాజు పరిపాలిస్తుండే వాడు, అని ప్రారంభమవుతాయి. ఈ కథలు వినోదం, నీతి, మాయాజాలం, మరియు అద్భుతమైన సంఘటనలతో కూడి, మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ సాగుతాయి. అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలు చాల వరుకు"అనగనగా ఒక ఊరిలో ఒక రాజు" లేదా చాలాకాలం క్రితం ఒక రాజ్యంలో అనే మాటలతో మెదలవుత యి .కథ ఆరంభంలో రాజు, రాణి, వారి రాజ్యం మరియు రాజ్యంలోని సంపద లేదా సమస్య గురించి పరిచయం చేస్తారు.యిలాంటి కథలు ఎన్నో మన ఛానల్ లో వున్నాయి. మీరు విని ఆనందిస్తూ like,share, comment and subscribe చేయగలరని ఆశిస్తున్నాను,ధన్యవాదాలు గాయత్రీ చంద్రశేఖర్
6 days ago | [YT] | 3
View 2 replies
Gayathri Creations
కాకమ్మక్క కథలు :-www.youtube.com/playlist?list...
చిన్నపిల్లలను అలరించడానికి, నీతిని భోదించడానికి బామ్మలు,అమ్మమ్మలు చెప్పే జానపద మరియు నీతికథల నుండి ఉద్భవించాయి .ఇవి ముఖ్యంగా కాకి, పిచ్చుక వంటి పక్షుల పాత్రలతో సాగుతాయి.ఇవి కథల ద్యార బంధుత్వం, కష్టపడటం మరియు సమయ స్పూర్తి వంటి విలువలను సరళమైన తెలుగులో నేర్పుతాయి .పూర్వం నుండి బామ్మమ్మల మాటల్లోని జానపద కథల రూపంలో ఇవి ప్రచారంలో వున్నాయి. కాకి, పిచ్చుక, పావురం వంటి పాత్రల ద్యార చిన్నపిల్లలకు మంచి ప్రవర్తనను, సమయ పాలనను నేర్పడానికి ఈ కథలను రూపొందించారు. ఇవి సాధారణంగా "అనగనగా ఒక కాకి" అనే రీతిలో మొదలై, సరళమైన తెలుగులో సాగుతాయి. కాకులు చుట్టూ చేరి సంతాపం ప్రకటించడం, సమయానికి గూటికి చేరుకోవడం వంటి లక్షణాలను ఆధారంగా చేసుకుని, కుటుంబ బంధాల ప్రాముక్యతను తెలుపుతూ ఈ కథలు వస్తువుంటై. యిలాంటి కథలన్నీ మన ఛానల్ లో వున్నాయి. మీరు విని ఆనందించగలరని ఆశిస్తున్నాను. అలాగే like share commment and subscribe చేయగలరని ఆశిస్తున్నాను, గాయత్రీ చంద్రశేఖర్
1 week ago (edited) | [YT] | 2
View 1 reply
Gayathri Creations
భోజరాజు కథలు :-www.youtube.com/playlist?list...
మధ్యభారత దేశంలోని మాల్వా ప్రాంతాన్ని పరిపాలించిన ప్రసిద్ద పరమార రాజు వంశం రాజు భోజరాజు. ఇతని రాజధాని ధార నగరం. ఈయన గొప్ప పండితుడు.కవి మరియు కళాపోషకుడిగా ప్రసిద్ది చెందాడు. నీతికి, న్యాయానికి పితృ వాత్సల్యంతో కూడిన పరిపాలనకు, మరియు విక్రమార్కుడి లాంటి ప్రజాదరణకు భోజరాజు చారిత్రక చిహ్నంగా నిలిచాడు.భోజరాజు స్వయంగా అనేక గ్రంధాలను రచించాడని, పండితులను ఆదరించాడని పేరు. ఈయన ఆ స్ధానంలో కాళిదాసు వంటి మహాకవులు ఉండేవారని ప్రతీతి.బోజరాజు గురించి చెప్పబడే కథలు తరుచుగా విక్రమార్కుడి కథలతో పోల్చబడ తాయి .ఈలాంటి కథలెన్నో మన ఛానల్ లో వున్నాయి . మీరు విని ఆనందించ గలరని ఆశిస్తున్నాను. అలగే like, share commment చేసి subscribe చేయగలరని ఆశిస్తున్నాను.ధన్యవాదాలు గాయత్రీ చంద్రశేఖర్
1 week ago (edited) | [YT] | 3
View 2 replies
Gayathri Creations
భారత చరిత్ర :-www.youtube.com/playlist?list...
భారత చరిత్ర అత్యంత ప్రాచీనమైనది మరియు వైవిధ్యమైనది. ఇది సింధులోయ నాగరికత నుండి ప్రారంభమై, వేదకాలం, మౌర్య గుప్త సామ్రాజ్యాలు, మధ్యయుగ ముస్లిం పాలన, బ్రిటిష్ వలసవాదం మరియు 1947 లో స్వాతంత్రయం పొందడం వరుకూ విస్తరించి ఉంది. ఈ సుదీర్ఘ చరిత్ర ప్రాచీన మధ్యయుగ మరియు ఆధునిక కాలాలుగా విభజించబడింది. ఈ సమాచారం అంతా మన చందమామలో సుమారు ఆరు సం. దరావాహికంగా ప్రచురించబడింది.ఈ సమాచారాన్ని అంతా సుమారు 30 వీడియే లుగా తయారు చేశాను. మీరు విని ఆనందించి like share comment and subscribe చేయగలరని ఆశిస్తున్నాను ధన్యవాదాలు గాయత్రీ చంద్రశేఖర్
2 weeks ago (edited) | [YT] | 3
View 6 replies
Gayathri Creations
తాతయ్య కథలు :-www.youtube.com/playlist?list...
తాతయ్య కథల ప్రస్తావన సాధారణంగా ఆత్మీయత పాత జ్ఞాపాకలతో మొదలవుతుంది. ఏ రా ! మనవాడ! భాగున్నావా?అంటూ ప్రేమగా పలకరిస్తూ "మా కాలంలో ఇట్టాలేదురా " అని పూర్వపు రోజులను గుర్తు చేస్తూ తాతయ్య కథలను ప్రారంభిస్తురు.నిండు పౌర్ణమి రాత్రి, పిల్లలంతా చుట్టూ చేరినప్పుడు తాతయ్య తన జీవిత అనుబావాలను నీతి కథల రూపంలో చెబుతారు. ఈ కథలు సాధారణంగా నీటిని భోధిస్తూ పిల్లలకి మంచి చెడుల మధ్య తేడాను తెలియజేస్తాయి .అమ్మమ్మ నానమ్మ లవలె, తాతయ్యలు చెప్పే కథలు పిల్లలకు ప్రేమను, ఆప్యాయతను పంచుతాయి .తరతరాలుగా వస్తున్న జానపద మరియు పురాణ కథలను తాతయ్యలు తమదైన శైలిలో,పాత్రలకు అనుగుణంగా మార్చి, హాస్యంతో కుదినకతలుగా వివరిస్తారు.ఇలాంటి కథలెన్నో మన ఛానల్ లో వున్నాయి. మీరు విని ఆనందించ గలరని ఆశిస్తున్నాను అలాగే like,share, comment and subscribe చేయగలరని ఆశిస్తున్నానుధన్యవాదాలు గాయత్రీ చంద్రశేఖర్
2 weeks ago | [YT] | 2
View 3 replies
Gayathri Creations
అత్తా కోడళ్ళ కథలు :-www.youtube.com/playlist?list... ఇవి కుంటుంబ సంబంధాలు, వంటలు, గొడవలు మరియు నీతి కథల రూపంలో రూపొందించబడ్డాయి. ఇటువంటి కథలు తరుచుగా వేసవి, చలికాలం వంటి సమయాల్లో అత్తాకోడళ్లు మధ్య జరిగే సరదా మరియు ఆసక్తికరమైన సన్నివేశాలను తెలియ జేస్తాయి.ఇవి సాధారణంగా కోడలి కష్టాలు అత్తగారి సాధింపులు లేదా తోడికోడళ్ళ మధ్య పోటీలు వంటి అంశాలతో కూడి ఉంటాయి. చాల కథలు నీతిని తెలియజేస్తూ, వినోదాన్ని పంచుతాయి. యిలాంటి కథ లెన్నో మన ఛానల్ లో వున్నాయి. విని ఆనందించగలరని ఆశిస్తున్నాను. అలగే like,share, commment చేయగలరని ఆశిస్తున్నాను.అలాగే subscribe చేగాలరని ఆశిస్తున్నాను ధన్యవాదాలు గాయత్రీ చంద్రశేఖర్
2 weeks ago | [YT] | 2
View 5 replies
Gayathri Creations
William Shakespeare:-www.youtube.com/playlist?list...
William shakespeare {1564-1616} ఆంగ్ల సాహిత్య చరిత్రలో అత్యంత గొప్పకవి,నాటక రచయిత మరియు నటుడు, "బర్ద్ద్ అప్ అవన్ " అని పిలవబడే ఆయన 39 నాటకాలు,154 సోనేట్లు మరియు అనేక కవితలు రాశారు.హోమేలేట్, రోమియో అండ్ జూలియట్, మక్బెత్ వంటి ఆయన రచనలు ప్రేమ,ద్రోహం మరియు మనవ భావోద్యే గల ను అద్భుతంగా చిత్రీకరిస్తు కాలాతీతంగా నిలిచాయి. వాటిలో కొన్నింటిని చందమామ వారు ప్రచురించారు. అనువాదం చేసిన వారు ఆర్. కోదండరామయ్యగారు. ఆ కథలకు చక్కని చిత్రాలను వేసినవారు చిత్రాగారు. ఆ కధలన్నింటిని వీడియే ల రూపంలో పొందుపరచాను. మీరు విని ఆనందించగలరని ఆశిస్తున్నాను అలాగే like,share, comment and subscribe చేయగలరని ఆశిస్తున్నాను.ధన్యవాదాలు గాయత్రీ చంద్రశేఖర్
2 weeks ago | [YT] | 2
View 3 replies
Load more