Hi Friends
NOTE: మన Model Ideas YouTube Channel ను Subscribe చేసుకున్న
వారు అడిగే ప్రశ్నలను చదువుతూ
Next వీడియోలో Answer Explain చేయడం జరుగుతుంది.

This is Rajendhar Bondla, IMPACT Foundation Trainer, Soft Skills Trainer, Personality Development and Motivational Speaker.
This "Model Ideas YouTube Channel", is to guide you Government Jobs, Degree, PG, Professional Courses & "Career Guidance", to my Subscribers. It helps you in reaching your targeted Goals.
Please contact/text mail me for
1) Promotion of Your Business
2) Promotion of Your APPS
3) Promotion of Your Institutes
4) Promotion of Your Websites/YouTube Channels
Please follow me on:
Website: englishgururaj.com/
Instagram: www.instagram.com/modelideasy...
Telegram Link: t.me/rajo15
e-mail: rajavalmiki18@gmail.com
YouTube: model Ideas
Face Book: www.facebook.com/profile.php?...
Face Book Page: www.facebook.com/Model-Ideas-...
Twitter:https: twitter.com/BondlaRajendhar


Model Ideas

*🔊వచ్చే నెల మొదటి వారంలో టీజీసెట్స్ నోటిఫికేషన్లు*

*🍥రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (టీజీసెట్స్ 2026) సందడి మొదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ల విడుదలకు ముందుగా, ఈ నెల 30న ఈఏపీసెట్‌ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, పరీక్షా కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ఉన్నత విద్యా మండలి అధికారులు వివిధ సెట్ల కన్వీనర్లతో సమగ్రంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, మే మొదటి వారం నుంచి ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు, మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. మే 12న ఎడ్ సెట్, మే 13, 14 తేదీల్లో ఐసెట్, మే 15న ఈ సెట, మే 18న లాసెట్, పీజీఎల్ సెట్, మే 28, 31 తేదీల్లో పీజీఈసెట్, మే 31 నుంచి జూన్ 3 వరకు పీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.*

3 weeks ago | [YT] | 11

Model Ideas

💐శుభోదయం..💐

శ్లో|| *భాస్కరస్య యథా తేజః*
*మకరస్థస్య వర్ధతే*।
*తథైవ భవతాం తేజః*
*వర్ధతా మితి కామయే*।

మకరరాశిలో ప్రవేశించిన సూర్యుని యొక్క తేజస్సు దిన దినం ప్రవర్ధమానము అయినట్లుగా
ఈ సంవత్సరం అభివృద్ధితో, సుఖశాంతులతో మీ కుటుంబం ప్రకాశించాలని మనః పూర్వకంగా కోరుకుంటూ మీకు,
మీ కుటుంబ సభ్యులకు
*మకర సంక్రాంతి శుభాకాంక్షలు*
Rajendhar Bondla
💐💐💐

1 month ago | [YT] | 10

Model Ideas

Happy New Year
ఈ సంవత్సరంలో మీ కోరికలు నెరవేరాలని,.
మీరు కోరుకున్న ఉద్యోగాలు రావాలని....
మనస్ఫూర్తిగా కోరుతూ.....

Rajendhar Bondla

1 month ago | [YT] | 14

Model Ideas

*🔊క్రాఫ్ట్‌ టీచర్ల పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందే*

*◻️కేవలం ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడం చెల్లుబాటు కాదు*

*🔸నోటిఫికేషన్‌లోని అంశాలను విస్మరించడం నిబంధనల ఉల్లంఘనే*

*🔷సుప్రీంకోర్టు స్పష్టీకరణ*

*🍥ఈనాడు, దిల్లీ: తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. క్రాఫ్ట్‌ టీచర్ల నియామకం కోసం 2023లో జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం... మళ్లీ పోటీ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 2023 ఏప్రిల్‌ 5న జారీచేసిన నోటిఫికేషన్‌ నెం.07/2023లో పోటీ పరీక్షను తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహిస్తామని పేర్కొని, ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడాన్ని తప్పుబట్టింది. అది నిబంధనల ఉల్లంఘన కిందికే  వస్తుందని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 21న హైకోర్టు సూచించినట్లుగానే నియామకాల కోసం మళ్లీ తాజాగా తెలుగు, ఆంగ్ల భాషల్లో పరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ జె.కె. మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. 2023 ఆగస్టు 1న నిర్వహించిన పరీక్షను... ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడంపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం బోర్డు వైఖరిని తప్పుబట్టింది. పరీక్ష రద్దుచేసి మళ్లీ తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహించాలని 2024 ఏప్రిల్‌ 4న ఆదేశించింది. ఆ తీర్పును సవాల్‌చేస్తూ బోర్డు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్‌ బెంచ్‌ కూడా ఆ తీర్పును సమర్థిస్తూ 2025 ఏప్రిల్‌ 21న ఉత్తర్వులు జారీచేసింది. నోటిఫికేషన్‌ నెం.07/2023ను ఉల్లంఘించకుండా సాధ్యమైనంత త్వరగా... మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది. ఆ రెండు తీర్పులను సవాల్‌చేస్తూ బోర్డు.. ఈ ఏడాది జులై 26న సుప్రీంకోర్టులో పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ) దాఖలుచేసింది. సోమవారం బోర్డు తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. నియామక పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులు... ఫలితాలు వెల్లడించిన తర్వాత నోటిఫికేషన్‌ను సవాల్‌చేశారని, అందువల్ల వారి వాదనలను పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. 88 ఖాళీల కోసం 5,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయని, మళ్లీ పరీక్ష నిర్వహిస్తే అర్హత సాధించిన అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం 9 మంది అభ్యర్థులు మాత్రమే కోర్టుకెళ్లారని, వారికి మాత్రమే రెండు భాషల్లో పరీక్ష నిర్వహిస్తామని, అందుకు అనుమతించాలని కోరారు. ఆ వాదనలతో జస్టిస్‌ జె.కె. మహేశ్వరి విభేదించారు. నియామక ప్రకటనలోని అంశాలను ఉల్లంఘించారు కాబట్టి... ఆ వాదనలు చెల్లుబాటుకావని స్పష్టంచేస్తూ పిటిషన్‌ను కొట్టేశారు. తప్పు చేసిన అధికారి నుంచి మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు అయ్యే ఖర్చులన్నీ రాబట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు*

4 months ago | [YT] | 17

Model Ideas

*🔊‘సీపీగెట్‌’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం*

*🍥ఈనాడు, హైదరాబాద్‌: సీపీగెట్‌-2025 మొదటి, రెండో విడత కింద ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి 14వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కన్వీనర్‌ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ నెల 15, 16న వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. విద్యార్థులు సీటు వచ్చిన కళాశాలలో 24న రిపోర్ట్‌ చేయాలన్నారు.*

4 months ago | [YT] | 9

Model Ideas

*🔊రేపటి నుంచి సీపీగెట్‌*

*🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్‌ పరీక్షలు ఈ నెల 4న ప్రారంభం కానున్నాయి. మొత్తం 44 సబ్జెక్టుల పరీక్షలు ఈ నెల 11న ముగుస్తాయి. మొత్తం 63,100 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్‌ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు.*

6 months ago | [YT] | 16