This is the official YouTube channel of Nara Lokesh
serving as the Information Technology and Communication & Industries Minister in the Government of Andhra Pradesh. He is the son of Telugu Desam Party (TDP) chief and the Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu
Nara Lokesh Official
Colombo is buzzing tonight! 🔥
And I’m cheering for Team India as the giants clash - India vs Pakistan!l There’s nothing like the thrill of cricket uniting millions with one heartbeat.
Let’s go boys - make the nation proud!
#INDvsPAK
2 hours ago | [YT] | 2,086
View 70 replies
Nara Lokesh Official
ఉండవల్లి నివాసంలో శనివారం మధ్యాహ్నం గుంటూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల పరిధి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వారి కుటుంబసభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించాను. అంతా కలిసి ఒకేచోట భోజనం చేస్తూ, మాట్లాడుకున్నాం. వివిధ సమస్యలపై నేతలు ఇచ్చిన విజ్ఞప్తులు ఎన్ని పరిష్కరించాను, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయో వివరిస్తూ ఓ నివేదిక వారికి అందించాను. ఆత్మీయ సమావేశానికి వచ్చిన సోదరీమణులకు మంగళగిరి చేనేత చీరలు కానుకగా అందజేశాను.
8 hours ago | [YT] | 3,658
View 30 replies
Nara Lokesh Official
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయం. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుందాం.
10 hours ago | [YT] | 319
View 5 replies
Nara Lokesh Official
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదించిన స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందిస్తోంది. విద్య, వైద్య, విపత్తు నిర్వహణ, ఉపాధి కల్పన వంటి కార్యక్రమాల ద్వారా ఎందరి జీవితాల్లోనో ఎన్టీఆర్ ట్రస్ట్ వెలుగులు నింపింది. సామాజిక సేవే పరమాధిగా ముందుకు సాగుతోన్న ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
12 hours ago | [YT] | 794
View 13 replies
Nara Lokesh Official
భక్తుల పాలిట పెన్నిధి, భోళా శంకరుడైన ఆ త్రినేత్రుడు లింగోద్భవం చెందిన పవిత్రమైన రోజు మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణతో నీలకంఠుడి కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర..ఓం నమః శివాయ.
#Mahashivratri2026
14 hours ago | [YT] | 2,987
View 47 replies
Nara Lokesh Official
నా ఆహ్వానాన్ని మన్నించి ఉండవల్లి నివాసంలో జరిగిన ఆత్మీయ విందుకు హాజరైన చిత్తూరు, అనకాపల్లి జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వారి కుటుంబసభ్యులకు స్వాగతం పలికాను. కుటుంబసభ్యుల్లా అంతా కలిసి భోజనాలు చేస్తూ ఆత్మీయంగా కబుర్లు చెప్పుకున్నాం. ప్రజా ప్రతినిధులు నాకు ఇచ్చిన వినతుల స్టేటస్ రిపోర్ట్ వారికి అందించాను. మా ఇంటికి వచ్చిన ఆడపడుచులకు ఒక సోదరుడిగా మంగళగిరి పట్టుచీరలు కానుకగా ఇచ్చాను.
1 day ago | [YT] | 11,158
View 180 replies
Nara Lokesh Official
And the build-out has kicked off!
With porta cabins in and heavy equipment rolling, the future of world-class education is taking shape in #Amaravati! I’m proud to see Birla Institute of Technology and Science, Pilani kick off construction of its new campus - where innovation, AI and next-gen learning will thrive. Welcome to the education capital in the making!
2 days ago | [YT] | 1,794
View 31 replies
Nara Lokesh Official
నా ఆహ్వానం మేరకు ఉండవల్లి నివాసానికి వచ్చిన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశాను. పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నాను. ఆయా ప్రజా ప్రతినిధులు ఇచ్చిన వినతులు తాజా స్థితి నివేదికలు వారికి అందజేశాను. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఆత్మీయ కలయిక నాలో సంతోషాన్ని నింపింది.
2 days ago | [YT] | 5,661
View 62 replies
Nara Lokesh Official
సినీ నిర్మాత బండ్ల గణేష్ గారిని ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను. సంకల్ప పాదయాత్ర జరిగిన తీరును అడిగి తెలుసుకున్నాను. శ్రీవారి ప్రసాదం స్వీకరించాను.
2 days ago | [YT] | 7,650
View 36 replies
Nara Lokesh Official
బిగ్ టీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేంద్ర రెడ్డి గారి మృతి బాధాకరం. వారి స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
3 days ago | [YT] | 1,266
View 19 replies
Load more