Sri Hayagreeva Stotraavali

One Stop For All Stotras, Mantraas and Pooja Vidhi


Sri Hayagreeva Stotraavali

🙏కనకధారా స్తోత్రం అర్థముతో🙏

శ్లోకం:-21

🌹🌹🌹

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః


🌹🌹🌹

అర్థము:-ఎవరీ స్తోతములచే ప్రతిదినమును వేద రూపిణియు, త్రిలోక మాతమునగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నారు.

#devotional #kanakadhaarastotram #kanakadhaara #shankarachaarya

5 months ago | [YT] | 3

Sri Hayagreeva Stotraavali

🙏కనకధారా స్తోత్రం అర్థముతో🙏

శ్లోకం:-20

🌹🌹🌹

కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః

🌹🌹🌹

అర్థము:-శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి! దరిద్రులలో ప్రథమస్థానంలో ఉన్నాను. నీ దయకు తగిన పాత్రమును అగునన్ను నీ కరుణా కటాక్షముతో చూడుము.

🌹🌹🌹

#devotional #kanakadhaarastotram #kanakadhaara #shankarachaarya

5 months ago | [YT] | 6

Sri Hayagreeva Stotraavali

🙏కనకధారా స్తోత్రం అర్థముతో🙏

శ్లోకం:-19

🌹🌹🌹

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

🌹🌹🌹

అర్థము:-దిగ్గజములు కనకపు కుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించ బడిన శరీరము గలదియు, లోకములకు జననియు, విశ్వ్రపభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియునగు లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను.

🌹🌹🌹

#devotional #kanakadhaarastotram #kanakadhaara #shankarachaarya

6 months ago | [YT] | 4

Sri Hayagreeva Stotraavali

🙏కనకధారా స్తోత్రం అర్థముతో🙏

శ్లోకం:-18

🌹🌹🌹

సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం


🌹🌹🌹

అర్థము:-కమలముల వంటి కన్నులు గల ఓ తల్లి చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ! విష్ణుప్రియా!, మనోజ్ఞులారా!, ముల్లోకములకు సంపదను ప్రసాదించు మాతా! నన్ననుగ్రహింపుము.

🌹🌹🌹

#devotional #kanakadhaarastotram #kanakadhaara #shankarachaarya

6 months ago | [YT] | 6

Sri Hayagreeva Stotraavali

🙏కనకధారా స్తోత్రం అర్థముతో🙏

శ్లోకం:-17

🌹🌹🌹

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే


🌹🌹🌹

అర్థము:-ఏదేవియొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్థ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరియగు లక్ష్మీదేవిని... నిన్ను మనో వాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును.

🌹🌹🌹

#devotional #kanakadhaarastotram #kanakadhaara #shankarachaarya

6 months ago | [YT] | 5

Sri Hayagreeva Stotraavali

🙏కనకధారా స్తోత్రం అర్థముతో🙏

శ్లోకం:-16

🌹🌹🌹

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

🌹🌹🌹

అర్థము:-పద్మములవంటి కన్నులగల పూజ్యురాలవగు నోయమ్మా! నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదలు కలగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవి, పాపములను నశింపచేయునవి. ఓ తల్లి అవి ఎల్లప్పుడును నన్ను అనుగ్రహించుగాక!

🌹🌹🌹

#devotional #kanakadhaarastotram #kanakadhaara #shankarachaarya

6 months ago | [YT] | 2

Sri Hayagreeva Stotraavali

🙏కనకధారా స్తోత్రం అర్థముతో🙏

శ్లోకం:-15

🌹🌹🌹

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై


🌹🌹🌹

అర్థము:-తామరపువ్వులవంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలునగు లక్ష్మీదేవికి నమస్కా రము.

🌹🌹🌹


#devotional #kanakadhaarastotram #kanakadhaara #shankarachaarya

6 months ago | [YT] | 5

Sri Hayagreeva Stotraavali

🙏కనకధారా స్తోత్రం అర్థముతో🙏

శ్లోకం:-14

🌹🌹🌹

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

🌹🌹🌹

అర్థము:-భృగుమహర్షి పుత్రికయును, విష్ణు వక్ష:స్థలవాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.

🌹🌹🌹

#devotional #kanakadhaarastotram #kanakadhaara #shankarachaarya

7 months ago | [YT] | 3

Sri Hayagreeva Stotraavali

🙏కనకధారా స్తోత్రం అర్థముతో🙏

శ్లోకం:-13

🌹🌹🌹

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై

🌹🌹🌹

అర్థము:-బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయికయైనదియును, దేవతలలోదయమే ముఖ్యముగా గలదియును, విష్ణువుకు ప్రియురాలునుయైన లక్ష్మీదేవికి నమస్కారము.

🌹🌹🌹

#devotional #kanakadhaarastotram #kanakadhaara #shankarachaarya

7 months ago | [YT] | 2