నేను పుట్టినదేశంలో దేశ రక్షణే నాధ్యేయం,
నేను పుట్టిన ధర్మంలో ధర్మ రక్షణే నా కర్తవ్యం.
దేశం కోసం ధర్మం కోసం అహర్నిశలు పోరాడుతూనే ఉంటా. నా ఈ పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధర్మబద్ధంగానే ఎదుర్కొంటు గమ్యం చేరడం నా చివరిలక్ష్యం.
నేను ఎవరికి వ్యతిరేకిని కాను... నాకు ఎవరు వ్యతిరేకం కాకండి.
youtube.com/@sriramdaldharmajagaran?si=jAgSPLoxnYe…
youtube.com/@PrasadK6
Facebook link :- Prasad Sriram Dal
www.facebook.com/profile.php?id=100008395693668&am…
Prasad Sriram Dal
హైందవ భగవత్బంధువులఅందరికీ శుభోదయం 🌹
వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షల 🙏
వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ఈ పవిత్ర పర్వదినాన, ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు!
గోవింద నామ స్మరణతో, వైకుంఠ వాసుని కృపాకటాక్షాలతో మీ జీవితం ఆనందమయం కావాలని ఆశిస్తూ... ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.
ముక్కోటి దేవతలు కొలిచే ఆ దేవదేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు!
జై శ్రీమన్నారాయణ 🙏
గొవిందా గోవిందా 🙏
#vaikuntaekadasi #lordvenkateswara #tirupati #govinda #tirumala #delhi #tirumalahills #hyderabad #tirumalatirupatidevasthanam #lordbalaji #tirumalatemple #chennai #iskcon #tirupathi #krishna #lordkrishna #rajasthan #bihar #hindutemple #tirupatismartcity #tirumaladarshan #gujarat #tpttsc #punjab #maharashtra #natgeoindia #chittoor #andhrapradesh #bengaluru #ekadashi
1 month ago | [YT] | 6
View 0 replies
Prasad Sriram Dal
అందరికి జై శ్రీరామ్ 🙏🏻
నిన్న అనగా 18 జులై 2025 శుక్రవారం సాయంత్రం 5:00 గం. లకు రామచందరావు బంజర్ శివాలయంలో జరిగిన "హిందూ ఐఖ్యత" పేరిట సమావేశ కార్యక్రమం అద్భుత విజయం సాధించింది.
ఇందులో భాగం అయిన ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻.
ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం :-
కొన్ని సంవత్సరాలుగా రామచందరావు బంజర్ శివాలయాన్ని అక్కడి SC కాలనీ వాసులు నిర్మాణం చేయడం ఒక అద్భుతం అయితే, ఈ శివాలయంలో ఒక దళిత వ్యక్తి పూజారిగా ఉండటం నిజంగా గొప్పవిషయం. ఈ విషయాన్ని తెలుసుకున్న హిందూ సైన్యం అక్కడికి వెళ్లి, వీళ్ళు గుడి నిర్మాణం చేసి నిత్య పూజలు చేయడమే కాక, సనాతనధర్మ పరిరక్షణలో భాగం అవుతున్నారు అనేవిషయాన్ని తెలుసుకొని మరీ వీళ్ళను శాలువతో సత్కరించడం జరిగింది.
ఇంకా ధర్మ పరిరక్షణలో అందరూ కలిసికట్టుగా ముందుకు నడవాలి అని తెలియచేయడం జరిగింది.
రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాలు తిరిగి హిందువులను చైతన్యం పరిచే కార్యక్రమంలో మేము పాల్గొంటాం అని ఈ కాలనీ వాసులు తెలియచేశారు. దీనికి గాను అక్కడికి వెళ్లి మేము మీకు తోడుగా ఉంటాం అని భరోసా ఇస్తూ, వారిని అభినందించడమే దీని ముఖ్య ఉద్దేశంగా ఈ సమావేశ ఏర్పాటు జరిగింది.
ఈ కార్యక్రమంలో :-
శ్రీరామ్ ధళ్,
RSS,
బీజేపీ
మరియు హిందూ సైన్యం, గ్రామ పెద్దలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.
జై శ్రీరామ్ 🚩
ఓం నమశ్శివాయ 🙏🏻
6 months ago | [YT] | 11
View 0 replies
Prasad Sriram Dal
అందరికి జై శ్రీరామ్ 🙏🏻.
నిన్న అనగా 06 జులై 2025 ఆదివారం రోజున మానుకోట జిల్లా, తొర్రుర్ మండలం, అమ్మాపురం గ్రామంలో జరిగిన హిందూ మేల్కొలుపు" కార్యక్రమంలో ఎవరు ఊహించని విషయాలపై చర్చించి, చాలా మంది అభిప్రాయాలను స్వీకరించడం జరిగింది. ఎవరికి తోచిన రీతిలో వారు వాళ్ళ విలువైన అభిప్రాయాలను తెలియచేయడం జరిగింది.
అలాగే ముందుగా RSS వారి ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం పూర్తయిన అనంతరం, "హిందూ మేల్కొలుపు" సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించి, చాలామందిలో కొత్త విషయాలకు పదునుపెట్టే దిశగా ఈ సమావేశం జరిగింది.
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పలుచోట్ల ఎన్నో నిర్వహించి, హిందువులలో చైతన్యం వొచ్చేవిధంగా అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం అని మాట్లాడుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో....
RSS కార్యకర్తలు,
BJP మండలస్థాయి కార్యకర్తలు,
శ్రీరామ్ దళ్ ధర్మ జాగరణ కార్యకర్తలు
మరియు
స్థానిక హిందువులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
7 months ago | [YT] | 10
View 2 replies
Prasad Sriram Dal
"హిందూ ఐక్యత" పేరిట నేడు 27 జూన్ 2025 శుక్రవారం రోజున సాయంత్రం 5:00 గం.లకు ఉప్పలచలక గ్రామంలోని, చక్కిలాల సతీష్ గారి ఇంట్లో హిందూ సైన్యం సమావేశం అవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హిందూ పెద్దలు పాల్గొని ఇలాంటి సమావేశాలను ప్రతి గ్రామంలో నిర్వహించి, అక్కడి వారిలో చైతన్యం వొచ్చేలా ముందుకు వెళదాం అని తెలియచేయడం ఒక మంచి పరిణామం.
రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగ్రామాలలో ఉన్న హిందువులను కలిసి, వారందరిని ఒకటిచేయడమే లక్ష్యంగా పనిచేయనున్నాం.
అలాగే ధర్మపరిరక్షణ కోసం ఒంటరి పోరాటం చేస్తున్న సతీష్ గారికి, అశోక్ రెడ్డి గారికి శాలువాతో సత్కరించడం జరిగింది. మరికోన్ని విషయాలను రేపు వీడియోలో చూసి తెలుసుకుందాం.
జై శ్రీరామ్ 🚩
హిందువుల ఐక్యత వర్ధిల్లాలి ✊🏻
7 months ago | [YT] | 11
View 4 replies
Prasad Sriram Dal
https://youtu.be/6L_Nc99GVqM?feature=...
నిన్న అనగా 15 జూన్ 2025 ఆదివారం రోజున అశోక్ రెడ్డిగారి ఇంట్లో కట్టర్ హిందూ సైన్యం సమావేశం అవ్వడం జరిగింది. అశోక్ రెడ్డి గారితో పాటుగా కొంతమంది హిందువులు ధర్మ పరిరక్షణకోసం చేసిన పోరాటాలను కొనియాడటం జరిగింది. భవిష్యత్తులో హిందువులందరు ఒక తాటిమీదకొచ్చి ఒక సైన్యంగా ఏర్పడి ధర్మ పరిరక్షణలో కలిసికట్టుగా ముందుకు సాగాలి అనేదే లక్ష్యంగా ఈ పోరాటాన్ని ఆదివారం, భాస్కరుని రోజున మొదలు పెట్టడం నిజంగా ఆనందదాయకం.
ఇంకా ఎవరైనా కలిసి పనిచేయడానికి ఆశక్తిగా ఉంటె చెప్పగలరు (9016068257). ఈ సమావేశంలో ఇంకా చాలా విషయాలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశ కార్యక్రమంలో ముఖ్యమైన హిందూ సంఘాలవారు, శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కట్టర్ హిందూ వాదులు మరియు కొంతమంది RSS కార్యకర్తలు పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయడం జరిగింది.
ప్రతి ఊరిలో ఈ చైతన్యం రావాలి. ప్రతి గ్రామంలో సమావేశ కార్యక్రమాలు జరగాలి, అందరూ కలిసి కట్టుగా పోరాటం సాగించడమే కాదు, ఒకరికొకరు భరోసాగా నిలవాలి. దీనికి మేము సిద్ధం మరి మీరు సిద్ధమా..!
సమావేశం అయిన స్థలం :-
తెలంగాణ రాష్ట్రంలోని,
ఖమ్మం జిల్లా,
పెనుబల్లి మండలం,
రామచంద్రాపురం గ్రామంలోని అశోక్ రెడ్డిగారి ఇంట్లో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది.
జై శ్రీరామ్ 🚩
8 months ago | [YT] | 10
View 0 replies
Prasad Sriram Dal
శ్రీరామ్ దళ్ ధర్మ జాగరణ కార్యకర్తలు ఇచ్చిన స్పూర్తితో ఎక్కడా తగ్గని హిందూ చైతన్యం.
మళ్ళీ నేడు అదే స్పూర్తితో మానుకోట జిల్లా, తొర్రుర్ మండలం, అమ్మాపురం గ్రామంలో మరో వీధికి "శివ్ నగర్" అని నామకరణం చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరగాలి, యువత కదలాలి.
ఏ ఊరు వెళ్లినా ఆ వీధి పేర్లతోనే మతమార్పిడి గాళ్ళకు జల్లుమనాలి. ఆ వీధిలోకి మతప్రచారానికి వెళ్ళాలి అంటేనే కొద్దిసేపు అలోచించి వెనుతిరిగేలా ఉండాలి. దీనికోసం ప్రతి గ్రామంలో హిందువులు కదలాలి.
జాగో హిందూ జాగో
ఇట్లు
మీ...
శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ.
8 months ago | [YT] | 15
View 4 replies
Prasad Sriram Dal
మీకు తెలుసా...? ఇంకా ఇలాంటి గొప్ప కార్యకర్తలు ఉండబట్టే ధర్మం నిలబడుతుంది అనేది దీనిద్వారా మనం అర్ధం చేసుకోవొచ్చు.
తెలంగాణ రాష్ట్రంలోని, మానుకోట జిల్లా, తొర్రుర్ మండలం, అమ్మాపురం గ్రామం హిందూ సింహాల విజయం ఇది.
ఇంత గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టిన వీళ్ళ కాళ్లకు శిరస్సువొంచి నమస్కరిస్తున్నా 🙏🏻.
ధర్మం కోసం, దేశం కోసం అహర్నిశలు కృషిచేసిన దేశ, ధర్మ పరిరక్షకుడు అయినా "ఛత్రపతి శివాజీ మహారాజ్" పెద్ద కుమారుడు చావా "ధర్మవీర్ శంభాజీ మహారాజ్" యోక్క పోరాట పటిమ యావత్ భారతావనికి ఆదర్శంగా తీసుకోవాలి.
ఇదే ఆదర్శాన్ని అమ్మాపురం గ్రామ చావా సైన్యం వారి వీధికి "సంబాజి మహారాజ్" పేరుపెట్టి నేటి సమాజానికి వీళ్ళు ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి సైనికులు "శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ" కార్యకర్తలు అయినందుకు గర్వంగా ఉంది.
ఇదే ఆదర్శం ప్రతిఊరులో రావాలి అని మనం అందరం కోరుకుందాం...!
జై భవాని 🚩
వీర శివాజీ 🚩
జయహో సంబాజి మహారాజ్ కి జై 🚩
9 months ago | [YT] | 22
View 4 replies
Prasad Sriram Dal
తమ ఇంటి సమీపం లో ఉన్న శివాలయం లోని శివలింగాన్ని మొగలు సైనికులు అపవిత్రం చేయడాన్ని చూసి చలించిన ఆ బాలిక, తండ్రి దగ్గరకి పరుగున పోయి, "తండ్రీ, ఆ తుచ్చులు చేయరాని పని చేస్తున్నారు, వారిని దండించండి" అంటే ఆ తండ్రి, "తల్లీ, మనం మొగలు పాదుషా కొలువులో ఉన్నాము, వారినేమీ చేయలేము" అని దీనంగాa బదులిచ్చాడు.
ఆ తరువాత బాలికకు పెళ్లి అయినాక, మరలా అదేవిధమైన దుశ్చర్యని చూసిన ఆమె భర్తని అడిగింది, వాళ్ళని శిక్షించమని కానీ ఆమెకి చిన్నప్పుడు తండ్రి చెప్పిన సమాధానమే ఎదురయ్యింది.
అప్పుడు ఆ మహా సాధ్వి ప్రతిజ్ఞ చేసింది, "నా తండ్రి మరియు నా భర్త చేయలేనిదానిని నాకు పుట్టబోయే పుత్రుని ద్వారా చేయిస్తాను" అని..ఆ నాటి నుండి శివునిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆమె, తనకి పుట్టిన బిడ్డకి ఆ పరమ శివుని పేరే పెట్టుకుంది
చిన్ననాటి నుంచి ఆ బాలుని నర నరానా దేశభక్తి, ధైర్య సాహసాలు నూరి పోసింది. అతను తల్లికి ఇచ్చిన మాట ప్రకారం హిందూ సంస్కృతిని అవమానించిన తురుష్కులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు హిందూ సామ్రాజ్యాన్ని తల్లికి కానుకగా ఇచ్చాడు.
ప్రతి తల్లి తమ కోడెలను ఒక శివాజీగా తయారు చేయాల్సిన అవసరం చాలా ఉంది.
ఆ తల్లి జిజాబాయి, ఆమె పుత్రుడు ఛత్రపతి శివాజీ.
అదిగో ఛత్రపతి.. ద్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి
మాతృభూమి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వ భౌముడు.
🚩జై భవానీ🚩
🚩జై శివాజీ🚩
11 months ago | [YT] | 12
View 0 replies
Prasad Sriram Dal
ఈ రోజు 11 జనవరి 2025 శనివారం రోజున మా పాప గీతాంజలి చదువుతున్న పాఠశాల లక్ష్య ట్యాలెంట్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉన్న సందర్భముగా... మా పాపను గోదాదేవి వేషాధారణలో రమ్మంటే, అదే రీతిలో మా పాపను గోదాదేవిగా ready చేసి నా శ్రీమతి పాపను వాళ్ళ పాఠశాలకు పంపించింది.
మన పిల్లలు చదివే పాఠశాలలో మనపండుగలకు ఇలాంటి వేషాధారణ ద్వారా మన పిల్లలకు మన సంకృతి, సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని తెలపకనే తెలిపినవాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి అవకాశాలను అస్సలు వొదలకండి.
అలాగే మన సంస్కృతిని పిల్లలకు తెలియచేసే విధంగా మన పండుగలు చేస్తున్న లక్ష్యా ట్యాలెంట్ స్కూల్ లాంటి అన్ని పాఠశాలల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు 🙏🏻 తెలియచేసుకుంటున్నాం.
#hindhuisum#our#culture@prasadsriramdal
1 year ago | [YT] | 18
View 4 replies
Prasad Sriram Dal
మా అందరి ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాల ప్రయాణం 29 నవంబర్ 2024 శుక్రవారం మొదలింది.
ఈ ప్రయాణంలో రామ్ టెక్ మహారాష్ట్ర, కాశి నగరి, సీతామాడి, నైమిశరణ్య, అయోధ్య ధామ్, మథుర, బృందావనం, గోకులం, గోవర్ధనగిరి పర్వతం, ఆగ్రా రాజకోట మరియు బాసర సరస్వతి మాత దర్శనంతో నేను అనగా 12 డిసెంబర్ 2024 గురువారంతో పూర్తి చేసుకున్నాం.
మా ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది. అందరం దైవసన్నిధిలో తరించిపోయాం.
మల్లి మళ్ళీ వెళ్ళాలి అనే అనుభూతి కలుగుతుంది. ఇలాంటి పుణ్యక్షేత్రాల దర్శనాలతో అందరిలో ధకీవభక్తిని పెంపొందించాలి అనేది మా ముఖ్య ఉద్దేశం.
1 year ago | [YT] | 13
View 0 replies