IMPORTANT NOTE :
Telugu Tv Channel,Village Entertainments,Short films,Folk Songs Latest,News update, Live,Live Shows, Entertainment, Video Songs, Audio Songs, Interviews published on our 69 Tv Telugu Channel
All kinds of programs are not meant to humiliate anyone.
We are broadcasting. If there are any comments, compliant, copyrights on these please pre-mail my mail
Can give information.our mail : www.69tvnews@gmail.com
THANK YOU
Copyright Notice: Please feel free to leave me a notice if you find this upload inappropriat
69Tv Telugu Channel is one of the leaders in the production and un-biased and comprehensive news and entertainment programmes in India and abroad
69Tv Telugu delivers reliable information across all platforms:TV, Internet and Mobile.
Thank U For Watching
69Tv
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని సస్పెండ్.. ఫలితాల్లో కానిస్టేబుల్ భార్య విజయం...
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తన భార్య తరఫున ప్రచారంలో పాల్గొన్నట్లు ఓ కానిస్టేబుల్‌పై ఆరోపణలు రాగా.. అతడిని సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెలువడిన ఫలితాల్లో.. ఆ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ భార్య విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆ కానిస్టేబుల్ భార్య.. తన ప్రత్యర్థిపై గెలుపొందారు.
5 days ago | [YT] | 9
View 0 replies
69Tv
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కొత్త తలనొప్పి..ఇండిపెండెంట్ల గొంతెమ్మ కోరికలు...
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల రూపంలో కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఆయా మున్సిపాలిటీల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ.. విజయానికి కావాల్సిన సీట్లు రాకపోవడంతో.. ఇప్పుడు ఆ పార్టీలకు స్వతంత్రుల మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచిన వారికి బాగా డిమాండ్ పెరిగింది. దీంతో వాళ్లు.. తమకు ఏ పార్టీ అయితే ఛైర్మన్ పదవి ఇస్తుందో ఆ పార్టీకే మద్దతు తెలుపుతామని గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు.
5 days ago | [YT] | 0
View 0 replies
69Tv
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు షాక్..
మంత్రి వివేక్‌కు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. సొంత నియోజవర్గంలోని క్యాతనపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజార్జీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది.
5 days ago | [YT] | 13
View 0 replies
69Tv
దుబ్బాక మున్సిపాలిటీలో సమాన ఓట్లు.. లక్కీ డ్రాతో విజేత ప్రకటన...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టించాయి. దుబ్బాక మున్సిపాలిటీలోని మూడో వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు చెరో 357 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటించారు.అధికారులు చిన్న స్లిప్పులపై ఇద్దరు అభ్యర్థుల పేర్లు రాసి ఓ బాక్సులో వేసి డ్రా తీశారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు రావడంతో అధికారులు ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు.
5 days ago | [YT] | 2
View 0 replies
69Tv
గెలిచిన అభ్యర్థులకు వెంటనే సర్టిఫికేట్లు...రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం...క్యాంపులకు వెళ్లిన వారి పరిస్థితేంటి..?
తెలంగాణ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రంలోనే గెలిచినట్లుగా ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి సంతకంతో పాటు.. గెలిచిన అభ్యర్థి సర్టిఫికెట్ తీసుకున్నట్లుగా సంతకం తీసుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు క్యాంపులకు వెళ్లిపోగా.. వారి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
5 days ago | [YT] | 5
View 0 replies
69Tv
కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఎర్రజెండా.. కూనంనేని గడ్డపై సీపీఐ ఘన విజయం...
కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎర్రజెండా ఎగిరేందుకు సమయం ఆసన్నమైంది. అత్యధిక స్థానాల్లో గెలిచిన సీపీఐ కార్పొరేటర్ అభ్యర్థులు.. మేయర్ కుర్చీపై కన్నేశారు. కూనంనేని సాంబశివరావు నియోజకవర్గంలో.. సీపీఐ ఘన విజయం ఆ పార్టీలో సరికొత్త జోష్‌ను నింపింది. ఇక కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా టీడీపీతో కలిసి పోటీ చేసిన సీపీఐ.. ఘన విజయం సాధించి హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు.
5 days ago | [YT] | 9
View 0 replies
69Tv
రూ.2,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా...మాదాపూర్ చెరువులో నిర్మాణాలు...రూ.లక్షల్లో అద్దెలు..
ఆక్రమణల కూల్చివేతలు, కబ్జాల కట్టడికి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా.. హైదరాబాద్‍లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులను రక్షిస్తూ.. అందరి ప్రశంసలు పొందుతోంది. ఇటీవలె రూ.1500 కోట్ల ఆక్రమణలను తిరిగి స్వాధీనం చేసుకున్న హైడ్రా.. తాజాగా మరో రూ.2200 కోట్ల భూమిని రక్షించింది. హైడ్రా ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు ఈ భారీ ఆపరేషన్ సక్సెస్ చేశారు.
5 days ago | [YT] | 10
View 0 replies
69Tv
తెలంగాణలో 15 రోజుల్లో కొత్త పథకం..ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వారికి కూడా..!
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకాన్ని అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులను కూడా చేర్చనున్నారు. ఉద్యోగుల జీతంలో నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని.. దానికి సమానంగా ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించారు. 15 రోజుల్లో ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకంపై సంబంధిత అధికారులతో సీఎస్ చర్చలు జరిపారు.
5 days ago | [YT] | 0
View 0 replies
69Tv
నా డబ్బులు, కుక్కర్లు ఇచ్చేయండి.. ఫలితాలు రాకముందే వసూలు...
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఓ అభ్యర్థి తనకు తానే ఓడిపోతానని డిసైడ్ అయ్యాడు. దీంతో తన వార్డు పరిధిలో పంచిన డబ్బులు, గిఫ్ట్‌లుగా ఇచ్చిన కుక్కర్లను ఇవ్వాలని ఇంటింటికీ తిరిగి డిమాండ్ చేశాడు. ఈ ఘటనతో ఆ వార్డు ఓటర్లు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తమ ఇళ్లల్లో నుంచి కుక్కర్లను తీసుకొచ్చి వీధిలో వేసి ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎవరు ఇవ్వమన్నారు.. మళ్లీ ఎందుకు తిరిగి అడుగుతున్నారని ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
5 days ago | [YT] | 0
View 0 replies
69Tv
భారత్‌తో మ్యాచ్‌లో ఇంట్రెస్టింగ్ సీన్...అంపైర్‌తో నమీబియా కెప్టెన్ గొడవ..
ఐసీసీ టీ - 20 వరల్డ్‌కప్ 2026లో భారత్ – నమీబియా మ్యాచ్‌లో నమీబియా జట్టు కెప్టెన్ జెర్హార్డ్ ఎరాస్‌మస్ అంపైర్‌తో డెడ్ బాల్ అంశంపై వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ తర్వాత బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి 4 వికెట్లు తీశాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 209/9 పరుగులు చేయగా.. నమీబియా 116 పరుగులకే ఆలౌట్ అయింది.
5 days ago | [YT] | 3
View 0 replies
Load more