INTURI NAGESWARARAO

MLA, Kandukuru Constituency
Prakasam District, Andhra Pradesh

Like me on Facebook: www.facebook.com/iNRKandukuru

Follow me on Twitter: twitter.com/inrKandukuru

Follow me on Instagram: www.instagram.com/inr_kandukuru/

#yuvagalam
#yuvagalampadayatra
#yuvagalamlokesh
#padayatra
#kandukur
#kandukurtdp
#tdpkandukur
#inturinageswararao
#nageswararaointuri



INTURI NAGESWARARAO

మహాశివరాత్రి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీ పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఆలయ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, భక్తిభావంతో నిండి ఉంది. స్వామి వారి దర్శనం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆది దంపతుల ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


#MahaShivaratri #OmNamahShivaya #HarHarMahadev #Shiva #Devotional #AndhraPradesh #LordShiva #మహాశివరాత్రి #కందుకూరు

7 hours ago | [YT] | 14

INTURI NAGESWARARAO

ఈరోజు మహా శివరాత్రి పర్వదినాన, కందుకూరు పట్టణంలోని స్కంధపురి శ్రీ సోమేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించాము.ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.

ఓం నమః శివాయ...

#MahaShivaratri #Kandukur #Skandapuri #SomeswaraSwamy #OmNamahShivaya #HarHarMahadev #FamilyDarshan #Shiva #Devotional #AndhraPradesh #LordShiva #మహాశివరాత్రి #కందుకూరు

1 day ago | [YT] | 27

INTURI NAGESWARARAO

సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద నిన్న రాత్రి వైభవంగా ప్రారంభమైన “పాకల బీచ్ ఫెస్ట్‌” కార్యక్రమంలో పాల్గొన్నాను. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత–నృత్య ప్రదర్శనలు, ఆకట్టుకునే క్రాకర్స్ షో సందర్శకులను విశేషంగా అలరించాయి.

ఈ వేడుకలో మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి గారు, గొట్టిపాటి రవి గారు, కందుల దుర్గేష్ గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, నా సహచర ఎమ్మెల్యేలు మరియు కూటమి పార్టీల ముఖ్య నాయకులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.

పర్యాటకోత్సవాల ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ప్రకాశం జిల్లాను రాష్ట్ర పర్యాటక పటంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

#PakalaBeachFest #Singarayakonda #PrakasamDistrict #AndhraPradeshTourism #TourismDevelopment #CulturalFest #BeachFestival #MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

1 day ago (edited) | [YT] | 20

INTURI NAGESWARARAO

వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో, దేశ ఐక్యతను చాటుతూ CISF జవాన్లు చేపట్టిన కోస్టల్ సైక్లోథాన్ మన ఉలవపాడుకు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు 130 మంది CISF జవాన్లకు స్థానిక నాయకులు, ప్రజలు మరియు విద్యార్థులతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది.

దేశంలోని తీర ప్రాంతాలన్నింటినీ కలుపుతూ సుమారు 6,500 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేయడం నిజంగా సాహసోపేతం. వారి దీక్షకు, దేశభక్తికి నా హృదయపూర్వక అభినందనలు.

గతంలో సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి చేసిన మారణహోమాన్ని మనం మరువలేం. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, దేశ భద్రత విషయంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తీర ప్రాంత పరిరక్షణలో CISF పాత్ర ఎంతో కీలకం.

మనమందరం ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అది సరిహద్దుల్లో, తీర ప్రాంతాల్లో మన సైనికులు చేస్తున్న త్యాగాల ఫలితమే. నేటి విద్యార్థులు ఈ సైనికులను స్ఫూర్తిగా తీసుకుని, చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశ సేవలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.

#CISF #CoastalCyclothon #Ulavapadu #VandeMataram150 #JaiHind #India #CoastalSecurity

5 days ago | [YT] | 33

INTURI NAGESWARARAO

విద్యార్థుల కడుపు నిండకపోతే... కఠిన చర్యలు తప్పవు...

ఉలవపాడు జడ్పీ హైస్కూల్ లో విద్యార్థులను కలిసినప్పుడు, పక్కనే ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ లో భోజనం సరిగా పెట్టడం లేదని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి ఆవేదన విన్న వెంటనే... క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాస్టల్ కు వెళ్లి ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది.

వార్డెన్ ను, వంట సిబ్బందిని పిలిచి మెనూ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశాను. ప్రభుత్వం విద్యార్థుల కోసం నిధులు ఇస్తున్నప్పుడు, వారికి కడుపు నిండా, రుచికరమైన భోజనం పెట్టడంలో అలసత్వం ఎందుకు? అని ప్రశ్నించాను.

గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. ఇదే చివరి హెచ్చరిక... మరోసారి విద్యార్థుల నుంచి ఫిర్యాదు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులకు స్పష్టం చేశాను.

గత ఏడాది ఇదే హాస్టల్ స్లాబ్ కురుస్తోందని విద్యార్థులు చెబితే, వెంటనే మరమ్మతులు చేయించడం జరిగింది. భవనం బాగుంటే సరిపోదు, విద్యార్థుల ఆరోగ్యం కూడా ముఖ్యమే. పిల్లల సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.


#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

5 days ago | [YT] | 37

INTURI NAGESWARARAO

పేదల ఆరోగ్యానికి భరోసా....

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందుచూపుతో సంక్షేమం ఆగడం లేదు. అందులో భాగంగా ఈ రోజు కందుకూరులో 55 మంది లబ్ధిదారులకు రూ. 53.58 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

ఇప్పటివరకు మన నియోజకవర్గంలో 1089 మందికి సుమారు 9 కోట్ల రూపాయల సహాయం అందించాం. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యం.


#InturiNageswaraRao #Kandukur #CMRF #ChandrababuNaidu #TDP #AndhraPradesh #KandukurMLA #PublicWelfare #HealthCare #APAssembly #PedalaArogyam #GoodGovernance #PrajaSeva #KootamiGovernment

6 days ago | [YT] | 30

INTURI NAGESWARARAO

శ్రీకాళహస్తి క్షేత్రంలో ఫిబ్రవరి 10 నుండి 23 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, ఆలయ పాలక మండలి సభ్యురాలు శ్రీమతి కుసుమ కుమారి గారి చేతుల మీదుగా ఈ రోజు అందుకున్నాను.

ఆ పరమేశ్వరుని కృప కందుకూరు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

6 days ago | [YT] | 44

INTURI NAGESWARARAO

పాకల బీచ్ ఫెస్టివల్‌కు కందుకూరు రెడీ...

ఈ నెల 14, 15 తేదీల్లో వైభవంగా జరగనున్న 'పాకల బీచ్ ఫెస్టివల్'పై అవగాహన కల్పించేందుకు, ఈరోజు కందుకూరులో నిర్వహించిన 2K రన్ అద్భుతమైన స్పందనతో, పండుగ వాతావరణంలో సాగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు మరియు అధికారులతో కలిసి జెండా ఊపి పరుగును ప్రారంభించడం సంతోషంగా ఉంది.

కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ నుంచి NTR విగ్రహం వరకు యువత చూపించిన ఉత్సాహం చూస్తుంటే... రేపు జరగబోయే పాకల బీచ్ ఫెస్టివల్ విజయం ఖాయమనిపిస్తోంది! వందలాదిగా తరలివచ్చిన యువతీ యువకులు, కూటమి నాయకులు మరియు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

రండి.. ఈ నెల 14, 15 తేదీల్లో పాకల తీరంలో కలుద్దాం.. సంబరాలు చేసుకుందాం..

#PakalaBeachFestival #Kandukur #2KRun #InturiNageswaraRao #KandukurMLA #BeachFestival2024 #AndhraPradesh #YouthPower

6 days ago | [YT] | 13

INTURI NAGESWARARAO

లింగసముద్రం మండలం, లింగసముద్రం పంచాయితీ జంగంరెడ్డిపాలెంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరిపై ఆ దేవుని కృపాకటాక్షాలు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించాను.

ముఖ్యంగా, ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన మన గ్రామస్తులందరూ సొంతూరికి తరలిరావడం, వారందరినీ ఈ రోజు పేరుపేరునా ఆత్మీయంగా పలకరించడం నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. భక్తి భావంతో పాటు, మనవైన ఆప్యాయతలు వెల్లివిరిసిన ఈ వేడుకలో భాగస్వామినైనందుకు ధన్యుడిని.

జై శ్రీరామ్!

#Kandukur #Lingasamudram #Jangamreddypalem #Ramalayam #InturiNageswaraRao #Spiritual #Community

6 days ago | [YT] | 42

INTURI NAGESWARARAO

ఈరోజు లింగసముద్రం మండలంలో జరిగిన 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొని, రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది . రైతుల సంక్షేమమే ధ్యేయంగా, వారికి పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.

#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

6 days ago | [YT] | 22