APEPDCL, Visakhapatnam is a leading Indian power utility, engaged in Distribution of electrical power. APEPDCL is responsible for Distribution and bulk supply of electric power in the districts (operation circles)of Srikakulam, Visakhapatnam Vizianagaram, East Godavari and West Godavari of Andhra Pradesh. APEPDCL supplies power to over 49.7 lakh consumers belonging to different categories through network consisting of 587 Sub-stations of 33 KV level, 2322 feeders of 11 KV level and more than 1,27,4B7 Distribution transformers of different levels. The Corporate Office and Headquarters of APEPDCL is situated at Visakhapatnam
Awards:
National Gold Shield for Best performance as Distribution Company for 2007-08, National Gold Shield for Best performance in Rural Distribution Franchisee for 2007-08
APEPDCL
పీఎం సూర్య ఘర్ పథకం కింద ప్రభుత్వ రాయితీలు మరియు బ్యాంకు ఋణ సదుపాయంతో మీ ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోండి. విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకుని ఆదా చేయండి.
మరిన్ని వివరాల కోసం సమీప విద్యుత్ కార్యాలయాన్ని సంప్రదించండి లేదా 1912 కు కాల్ చేయండి.
#APEPDCL #SolarMaintenance #SolarEnergy #GoSolar #SaveElectricity #GreenEnergy #RenewableEnergy #SolarPower #EnergyEfficiency #EcoFriendly #SustainableLiving #CleanEnergy #SolarIndia #APSolar #SolarAwareness #PowerSmart #PMSuryaGhar
57 minutes ago | [YT] | 1
View 0 replies
APEPDCL
న్యూఢిల్లీ జరిగిన AI సమ్మిట్‌లో APEPDCL GIS మ్యాపింగ్ పై ప్రజెంటేషన్ చేసిన సీఎండి ఇమ్మడి పృధ్వీ తేజ్.
న్యూ ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి AI సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) సీఎండి శ్రీ ఇమ్మడి పృధ్వీ తేజ్ పాల్గొని, సంస్థలో అమలులో ఉన్న అత్యాధునిక GIS మ్యాపింగ్ వ్యవస్థపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు.
ఈ సమ్మిట్‌లో ప్రపంచ స్థాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులు, ఇంధన రంగ నిపుణులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా APEPDCL లో అమలవుతున్న డిజిటల్ మార్పులు, ముఖ్యంగా ఎండ్-టు-ఎండ్ GIS ఆధారిత ఆస్తి మ్యాపింగ్, డిజిటల్ ట్విన్ కాన్సెప్ట్, మరియు AI ఆధారిత గ్రిడ్ విశ్వసనీయత వ్యవస్థపై వివరణాత్మకంగా ప్రదర్శించారు.
APEPDCL ఇప్పటికే తన పరిధిలోని విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, సబ్‌స్టేషన్లు వంటి అన్ని నెట్‌వర్క్ ఆస్తులను పూర్తిగా జిఐఎస్ లో మ్యాప్ చేసి, వాటిని ఒక సమగ్ర డిజిటల్ ఎకోసిస్టమ్‌గా అభివృద్ధి చేసింది. ఈ GIS వ్యవస్థను SAP, ERP, అవుటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (GIS), మొబైల్ ఫీల్డ్ యాప్స్‌తో అనుసంధానం చేయడం ద్వారా రియల్‌టైమ్ మానిటరింగ్, వినియోగదారులకు వేగవంతమైన సేవల అందజేత సాధ్యమవుతోంది.
అదేవిధంగా, AI ఆధారిత ఎలక్ట్రిక్ గ్రిడ్ రిలయబిలిటీ సిస్టమ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఆధారిత తనిఖీలతో వాలిన స్థంభాలు, క్రాస్‌ఆర్మ్ టిల్ట్, విరిగిన,తుప్పు, భద్రతా లోపాలను గుర్తించే విధానాన్ని వీడియోలో ప్రదర్శించారు. ఈ విధానం ద్వారా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా గ్రిడ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేయవచ్చని వివరించారు.
ఈ ప్రదర్శనకు సమ్మిట్‌లో విశేష స్పందన లభించింది. సంప్రదాయ విద్యుత్ పంపిణీ సంస్థను సాంకేతిక ఆధారిత, డిజిటల్‌గా సమగ్ర వ్యవస్థగా మారుస్తున్న ఉత్తమ నమూనాగా APEPDCL ను ప్రశంసించారు.
APEPDCL భవిష్యత్ చర్యల్లో భాగంగా AI ఆధారిత కమర్షియల్ లాస్ డిటెక్షన్, ఇంటెలిజెంట్ యుటిలిటీ ఆపరేషన్ సెంటర్ (ఐయుఓసి) స్థాపన, రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్, డిమాండ్ రెస్పాన్స్ వంటి ఆధునిక విధానాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డిజిటలైజేషన్ నుండి స్పేషియల్ ఇంటెలిజెన్స్ దిశగా APEPDCL చేసిన ఈ ప్రయాణం దేశానికి, అంతర్జాతీయ వేదికలకు ఆదర్శంగా నిలుస్తుందని సీఎండి శ్రీ పృధ్వీతేజ్ తెలిపారు.
#APEPDCL #AIPoweredGrid #GISMapping #DigitalTransformation #SmartGridIndia #PowerSectorIndia #AIinEnergy #DigitalIndia #GridReliability #UtilityInnovation #SmartPower #TechForGood #PowerDistribution #AndhraPradesh #NewDelhiSummit
21 hours ago | [YT] | 11
View 0 replies
APEPDCL
స్మార్ట్ మీటర్స్ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన, సులభమైన విద్యుత్ సేవలు అందించడమే APEPDCL లక్ష్యం.
📞 ఇప్పుడే 1912 కి కాల్ చేసి స్మార్ట్ మీటర్ ఇన్స్టాల్ చేయించుకోండి.
⚡ మీ విద్యుత్ వినియోగాన్ని సులభంగా మరియు స్మార్ట్ గా నియంత్రించుకోండి.
#APEPDCL #EPDCL #SmartMeterPakhwada #ConsumerAwareness #SmartMeterAwareness #SmartMetering #RealTimeMonitoring #ElectricityUpdates #TransparentBilling #EnergyEfficiency
1 day ago | [YT] | 2
View 0 replies
APEPDCL
స్మార్ట్ మీటర్స్ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన, సులభమైన విద్యుత్ సేవలు అందించడమే APEPDCL లక్ష్యం.
📞 ఇప్పుడే 1912 కి కాల్ చేసి స్మార్ట్ మీటర్ ఇన్స్టాల్ చేయించుకోండి.
⚡ మీ విద్యుత్ వినియోగాన్ని సులభంగా మరియు స్మార్ట్ గా నియంత్రించుకోండి.
#APEPDCL #EPDCL #SmartMeterPakhwada #ConsumerAwareness #SmartMeterAwareness #SmartMetering #RealTimeMonitoring #ElectricityUpdates #TransparentBilling #EnergyEfficiency
1 day ago | [YT] | 2
View 0 replies
APEPDCL
ఇంటిపై ఉన్న సోలార్ యూనిట్‌కు కాలానుగుణంగా మెయింటెనెన్స్ చేయించండి. అప్పుడు విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా, అధిక సామర్థ్యంతో కొనసాగుతుంది.
మరిన్ని వివరాల కోసం సమీప విద్యుత్ కార్యాలయాన్ని సంప్రదించండి లేదా 1912 కు కాల్ చేయండి.
#APEPDCL #SolarMaintenance #SolarEnergy #GoSolar #SaveElectricity #GreenEnergy #RenewableEnergy #SolarPower #EnergyEfficiency #EcoFriendly #SustainableLiving #CleanEnergy #SolarIndia #APSolar #SolarAwareness #PowerSmart #PMSURYGhar
1 day ago | [YT] | 0
View 0 replies
APEPDCL
స్మార్ట్ మీటర్ తో మీ కరెంట్ వినియోగాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. బిల్లు ఖచ్చితంగా వస్తుంది.
📞 ఇప్పుడే 1912 కి కాల్ చేసి స్మార్ట్ మీటర్ ఇన్స్టాల్ చేయించుకోండి.
⚡ మీ విద్యుత్ వినియోగాన్ని సులభంగా, స్మార్ట్ గా నియంత్రించుకోండి.
#APEPDCL #EPDCL #SmartMeterPakhwada #ConsumerAwareness #SmartMeterAwareness #SmartMetering #RealTimeMonitoring #ElectricityUpdates #TransparentBilling #EnergyEfficiency
2 days ago | [YT] | 2
View 0 replies
APEPDCL
వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు Eastern Power Distribution Company of Andhra Pradesh Limited (APEPDCL) సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తూ విద్యుత్ సరఫరా సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తున్నారు.
విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏ సమస్య అయినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అదేవిధంగా, వాట్సాప్ నెంబర్ 9493681912 కు మెసేజ్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
#APEPDCL #EasternPowerDistribution #1912Helpline #PowerSupport #ElectricityServices #ConsumerCare #24x7Support #PowerSupply #AndhraPradesh #PublicServices #CustomerSupport #ElectricityHelp #DiscomServices #EnergyDepartment #ServiceAssurance
2 days ago | [YT] | 4
View 0 replies
APEPDCL
విద్యుత్ బిల్లు చెల్లించకపోతే అర్ధరాత్రి విద్యుత్ కనెక్షన్ తొలగిస్తాం, తక్షణమే ఈ నంబర్ కు కాల్ చేయండి లేకపోతే సప్లై నిలిపివేస్తాం వంటి భయపెట్టే సందేశాలు మీ మొబైల్ కు వస్తే వాటిని అస్సలు నమ్మకండి. ఇవి మోసగాళ్లు పంపించే ఫేక్ SMSలు లేదా వాట్సాప్ సందేశాలు మాత్రమే.
విద్యుత్ శాఖ ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిగత నంబర్ల ద్వారా బెదిరింపు సందేశాలు పంపదు. అలాగే OTP, బ్యాంక్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ కాల్ ద్వారా అడగదు.
ఇలాంటి అనుమానాస్పద సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా, అధికారిక వెబ్ సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా మాత్రమే సమాచారాన్ని నిర్ధారించుకోవాలి.
విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండి సైబర్ మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలి.
#APEPDCL #PublicAwareness #BewareOfFrauds #FakeSMS #FakeWhatsApp #CyberAwareness #ConsumerAlert #StayAlert #PowerConsumers #ElectricitySafety #DigitalSafety #AndhraPradesh #1912Helpline #ScamAlert #BeAlert #bewarealert
4 days ago | [YT] | 0
View 0 replies
APEPDCL
ఎనర్జీ అండ్ కాస్ట్ సేవింగ్స్ అంశంపై అవగాహన కల్పించేందుకు, ఎలిమెంట్స్ ఎనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ లో సంస్థ సీఎండి పృథ్వీతేజ్ ఇమ్మడి, డైరెక్టర్ ఆపరేషన్స్ టి.వి.సూర్యప్రకాష్, ఎలిమెంట్స్ ఎనర్జీ ఫౌండర్ ఆన్సన్ శాండో పాల్గొన్నారు. ఏపీఈపీడీసీఎల్ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో పంపిణీ వ్యయాలను తగ్గించడం, స్థిరమైన గ్రిడ్ నిర్వహణ లక్ష్యంగా ఈ వర్క్ షాప్ నిర్వహించబడింది.
#APEPDCL #ElementsEnergy #EnergyAndCostSavings #EnergySavings #DemandResponse #PowerManagement #SmartEnergy #EnergyEfficiency #AndhraPradesh #SustainableEnergy #ElectricityAwareness #SaveEnergySaveMoney #PowerForPeople #EnergyInnovation #PublicAwareness #CleanEnergyIndia #GreenFuture #PrudhvitejImmadiIAS #PrudhvitejImmadi #CMDAPEPDCL
4 days ago | [YT] | 6
View 0 replies
APEPDCL
విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుండి విశేష స్పందన లభించింది.
ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో 45 మంది వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత సమస్యలను నేరుగా సంస్థ సీఎండీ శ్రీ పృథ్వీతేజ్ ఇమ్మడి, ఐఏఎస్ గారి దృష్టికి తీసుకువచ్చారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎండీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ టి.వి. సూర్యప్రకాశ్, శ్రీమతి టి. వనజ, శ్రీ ఎస్. హరిబాబు, సీజీఎం శ్రీమతి వి. విజయలలిత, జీఎంలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
#DialYourAPEPDCLCMD #APEPDCL #PublicGrievance #PowerToPeople #ConsumerFirst #ElectricityServices #CMDInteraction #TransparentGovernance #GoodGovernance #PeopleConnect #Vizag #Visakhapatnam #AndhraPradesh #PowerDepartment #CustomerCare #IASLeadership #GovernmentInitiative
4 days ago | [YT] | 8
View 0 replies
Load more