My Self Vennelakanti Venkata Lakshmi Gayatri.
I'm Live In Vijayawada.
Iam a house wife with two kids .
And very much interested in social responsibility and awarenes.
I always believe in God and karma .
I'm so much passionate about sharing good and useful thoughts to youth and society.iam always trying to educate the people for a better society,why because good people will build good society.thank you 🙏
🤗ULTIMATEGAYATRI
శ్రీ మాత్రే నమః 🪷 🙏
14 hours ago | [YT] | 386
View 1 reply
🤗ULTIMATEGAYATRI
🪷 🙏 శ్రీ మాత్రే నమః 🪷 🙏
3 days ago | [YT] | 946
View 5 replies
🤗ULTIMATEGAYATRI
నేటి శ్రీ ఏడుపాయల వనదుర్గభవాని దేవి అమ్మవారి అలంకారం.
5 days ago | [YT] | 884
View 11 replies
🤗ULTIMATEGAYATRI
మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏 🌺 🙏 🌺 *లింగోద్భవం...........!!*
*లింగోద్భవ సమయం....*
నిశిత కాల పూజ (లింగోద్భవ సమయం): ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 11:55 నుంచి ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:56 వరకు.
చతుర్దశి తిథి ముగింపు: ఫిబ్రవరి 16, సోమవారం సాయంత్రం 05:34 గంటలకు.
సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది.
ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనేమాట వాస్తవమే.
అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆ భవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది.
పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవులాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం (లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు.
హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు.
భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.
మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థానమయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది. #bhakthi #arunachalasiva #dosubscribe #sayarunachalasiva #ultimategayatri #changeyourthoughts #mahashivratrispecial
1 week ago | [YT] | 224
View 1 reply
🤗ULTIMATEGAYATRI
మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు 🙏🌺#mahashivratri_special #bhakthi #lordsiva #saysiva siva.......
1 week ago | [YT] | 399
View 1 reply
🤗ULTIMATEGAYATRI
శ్రీ మాత్రే నమః 🙏🪷🙏🪷🙏
1 week ago | [YT] | 915
View 5 replies
🤗ULTIMATEGAYATRI
🌺"పురాణాల" ప్రకారం "క్షీరసాగర మథనం" (సముద్ర మథనం) జరిగినప్పుడు అందులో నుండి 14 రకాల అద్భుతమైన సంపదలు (రత్నాలు) ఉద్భవించాయి. వాటి వివరాలు :
🌊 సముద్ర మథనంలో ఉద్భవించిన 14 రత్నాలు
1. హాలాహలం (విషం) ☠️
మొట్టమొదట భయంకరమైన విషం పుట్టింది. లోకనాశనం జరగకుండా కాపాడటానికి శివుడు దీనిని మింగి 'నీలకంఠుడిగా' మారాడు.
2. కామధేనువు (సురభి) 🐄
కోరిన కోర్కెలు తీర్చే దివ్య గోమాత. యజ్ఞయాగాదుల నిర్వహణ కోసం దీనిని ఋషులకు (వశిష్ఠుడికి) ఇచ్చారు.
3. ఉచ్ఛైశ్రవము 🐎
ఏడు తలలు కలిగిన ఎగిరే శ్వేత అశ్వం (గుర్రం). దీనిని దేవేంద్రుడు తీసుకున్నాడు (కొన్ని కథల ప్రకారం బలి చక్రవర్తి).
4. ఐరావతం 🐘
నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు. ఇది దేవేంద్రుని వాహనంగా మారింది.
5. కౌస్తుభ మణి 💎
అత్యంత ప్రకాశవంతమైన, విలువైన మణి. దీనిని శ్రీమహావిష్ణువు తన వక్షస్థలంపై ధరించాడు.
6. పారిజాతం (కల్పవృక్షం) 🌳
కోరిన వరాలను ప్రసాదించే దివ్య వృక్షం. ఇది దేవలోకంలోని నందనవనానికి చేరింది.
7. అప్సరసలు 💃
రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి దివ్య సుందరీమణులు. వీరు స్వర్గలోకంలో నాట్యకత్తెలుగా స్థిరపడ్డారు.
8. లక్ష్మీదేవి 🌸💰
ఐశ్వర్యానికి అధిదేవత. ఆమె స్వయంగా శ్రీమహావిష్ణువును తన భర్తగా ఎంచుకుంది.
9. వారుణి 🍷
సుర (మద్యం) కు అధిదేవత. రాక్షసులు ఈమెను స్వీకరించారు.
10. చంద్రుడు 🌙
చల్లని వెన్నెల నిచ్చే చంద్రుడు. శివుడు చంద్రుని తన శిరస్సుపై ధరించాడు.
11. పాంచజన్యం (శంఖం) 🐚
విజయం మరియు శుభానికి చిహ్నమైన శంఖం. దీనిని విష్ణువు స్వీకరించాడు.
12. శార్జం (ధనస్సు) 🏹
అత్యంత శక్తివంతమైన దివ్య ధనస్సు.
13. ధన్వంతరి 👨⚕️
దేవతల వైద్యుడు (ఆయుర్వేద పితామహుడు). చేతిలో అమృత కలశంతో ఉద్భవించాడు.
14. అమృతం 🍯✨
చివరగా ధన్వంతరి చేతిలో అమృత కలశం వచ్చింది. దీనిని తాగిన వారికి మరణం ఉండదు. దీని కోసం దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది.🙏🙏
#bhakthi #changeyourthoughts #powerofprayer #mindset #selfimprovement #motivation #ultimategayatri
2 weeks ago | [YT] | 776
View 8 replies
🤗ULTIMATEGAYATRI
🙏దక్షిణా దేవి🙏
ఒక గోపిక ... సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి 'దక్షిణా దేవి' విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణా దేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
రాధా కృష్ణుల ప్రేమ ప్రపంచంలో ... ప్రణయ తీరాల్లో విహరిస్తూ వున్న రోజుల్లో 'సుశీల' అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా వుండేది.గోలోకములో రాస లీలా వినోదములో తన్మయుడై యుండగా అతని దక్షిణ భాగము నుండి ఒక కన్య జనించెను. కృష్ణుని దక్షిణ పార్శ్వము నుండి పుట్టినది కావున ఆమెకు దక్షిణా దేవి అను పేరు గలిగెను .ఈమె శ్రీ కృష్ణుని యర్ధాంగి యగు రాధకు ప్రియసఖి రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేయుచుండెను .
ఒకసారి ఆమె శ్రీ కృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడపై కూర్చుంది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ ... పరిగెత్తుకు రాసాగింది. అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది..దక్షిణ ,గోలోకము వదలి వైకుంటము నందున్న లక్ష్మీలో ప్రవేశించెను .దక్షిణా దేవి యద్రుశ్యు రాలగుట వలన యజ్ఞ యాగాదులు చేసిన వారికి ఫలము దక్కకుండా బోయెను.
"దానం యజ్ఞా నాం వరూధం దక్షిణా " అని శ్రుతి (యజ్ఞములు పూర్తియైన తరువాత దక్షిణా దానము తప్పని సరి . ఆ దక్షిణ యజ్ఞ ఫలమును కవచము వలె కాపాడి ,యజమానునకి చ్చును ) దేవతలకు హవిర్భాగములు సరిగా అందకుండా పోయెను . ఈ విషయమును దేవతలు బ్రహ్మతో చెప్పుకొనిరి . బ్రహ్మ కోరికపై విష్ణువు , లక్ష్మి నుండి దక్షిణను వేరు చేసెను .యజ్ఞ సంబందమైన సమస్త కార్యములను సంపన్న మొనర్చుటకు దక్షిణాదేవిని తీసుకుని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెండ్లి చేసెను .యజ్ఞ పురుషునికి దక్షిణ యందు ఫలుడు (ఫలము ) అను పుత్రుడు గలిగెను.
బ్రహ్మ ,కళ్యాణ సమయ మందు దక్షిణా యజ్ఞ పురుషులకు వర మిచ్చెను . "యజ్ఞము చేసిన తరువాత యోగ్యమైన దక్షిణ నీయనివారికి ఫలము లేక పోవును.దక్షిణా యుక్తమైన యజ్ఞమే ఫలము నిచ్చును " అని దక్షిణ లేని యజ్ఞముల ఫలము బలి చక్రవర్తికి చెందును.
" యే బ్రాహ్మణా బహు విదః తేభ్యో యద్దక్షి ణాన నయేత్ ,దురిష్టగ్ స్యాత్ " అని శ్రుతి (బాగుగా చదువుకొన్న బ్రాహ్మణులు, అధ్వర్యులు గాను ఋత్విక్కులు గాను ఇతర పాత్రల లోను నిలిచి యజ్ఞము జరిపించిన తరువాత వారి కియ్యవలసినంత దక్షిణ సరిగా నియ్యక పోయినచో యజమానికి అనర్ధము కలుగునని యర్ధము )
శ్రాద్ధ కర్మలయందు, యజ్ఞ కర్మల యందు, దేవతా ప్రీత్యర్ధం మొనరించిన సకల పూజా కార్యక్రమములందు యజ్ఞ కర్త దక్షిణ ఇవ్వకున్నను, పురోహితుడు దక్షిణ ఆర్జించని యెడల శ్రీ మహాలక్ష్మీ శాపముతో దరిద్రుడై భాదలను అనుభవించునని బ్రహ్మ వైవర్త పురాణం నందు వివరించబడినది.దక్షిణ ఇవ్వకుండా,తీసుకోకుండా చేయు కర్మ ఫలితాలు బలి చక్రవర్తికి చెందును.శ్రాద్ధ కర్మములందు అర్పించిన వస్తువులన్నియు బలి చక్రవర్తికి భోజన రూపమున చేరగలవు.
దక్షిణా దేవి స్తోత్రమును యజ్ఞ సమయమున పఠించిన వారికి సర్వ యజ్ఞ ఫలములు నిర్విగ్నంగా సంపన్నమగును.దక్షిణాదేవి దివ్య చరితా శ్రవణ మొనర్చిన వారికి ధనం, విద్య, స్ధిరాస్తులు, లభించును. అలాంటి దక్షిణా దేవిని పూజించిన వారికి వ్యాధుల బారి నుంచి బాధల బారి నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.#bhakthi #changeyourthoughts #powerofprayer #mindset #selfimprovement #motivation
2 weeks ago | [YT] | 31
View 0 replies
🤗ULTIMATEGAYATRI
నేటి శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి అలంకారం 🙏🪷
2 weeks ago | [YT] | 926
View 5 replies
🤗ULTIMATEGAYATRI
నేటి శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి అలంకారం 🙏🪷
3 weeks ago | [YT] | 961
View 7 replies
Load more