ఓం శ్రీ సరస్వత్వై నమః "సరః ప్రసరణం సర్వత్ర ఆస్తీతి"అంటే 'అంతటా వ్యాప్తి కలిగినది'అని సరస్వతి పదానికి అర్ధము. జ్ఞానమనే కాంతిని లోకమంతా నింపేది కనుక జ్ఞానసరస్వతి అని అమ్మవారిని కొలుస్తురుంటాము. "మూకం కరోతి వాచాలం" మూగవాడిని కూడా అనర్గళంగా మాట్లాడించే అమ్మ కనుక వాగ్దేవి అని అమ్మవారికి పేరు.సరస్వతి ఆరాధన మనలో కలిగే బ్రమ,మాంద్యం,మతిమరుపు,వాక్కులో లోపాలు వంటి జాడ్యాలను తొలగించి బుడ్డిని వికసింప చేస్తుంది.యాజ్ఞవల్క్యుడు, వాల్మీకి,వేదవ్యాసులు సరస్వతి ఆరాధన వలన సనాతన ధర్మానికి ఆచార్యులైనారు.శారదాంబ రూపంలో అమ్మవారిని దర్శించుకున్న వ్యాసుడు పాపన గోదావరి తీరంలో సరస్వతి విగ్రహాన్ని సైకతమూర్తిగా మలిచితే,ఆ మహాశక్తి అందు ప్రవేశించి వాక్కు,బుద్ధి,జ్ఞానస్వరూపిణిగా విద్యార్థులను అనుగ్రహిస్తున్నది.ఆ క్షేత్రమే యాసపురియై తదుపరి వాసరయై ప్రస్తుతం బాసరగా పిలువబడుతున్నది.బ్రహ్మచే సృస్టించబడిన మానవదేహం సరస్వతి దేవి అనుగ్రహంతో చైతన్య వంతమవుతుంది.తదుపరి అక్షరాభ్యాస సంస్కారంతో అది మరింత బలపడి మనో బుద్దులను వికసింపచేస్తుంది.మంచి ఆలోచనల ప్రవాహాన్ని లోకమంతా వ్యాపింపచేస్తుంది.ఇంతటి విశిష్టతను కలిగిన సరస్వతి దేవాలయం.