ఓం శ్రీ సరస్వత్వై నమః "సరః ప్రసరణం సర్వత్ర ఆస్తీతి"అంటే 'అంతటా వ్యాప్తి కలిగినది'అని సరస్వతి పదానికి అర్ధము. జ్ఞానమనే కాంతిని లోకమంతా నింపేది కనుక జ్ఞానసరస్వతి అని అమ్మవారిని కొలుస్తురుంటాము. "మూకం కరోతి వాచాలం" మూగవాడిని కూడా అనర్గళంగా మాట్లాడించే అమ్మ కనుక వాగ్దేవి అని అమ్మవారికి పేరు.సరస్వతి ఆరాధన మనలో కలిగే బ్రమ,మాంద్యం,మతిమరుపు,వాక్కులో లోపాలు వంటి జాడ్యాలను తొలగించి బుడ్డిని వికసింప చేస్తుంది.యాజ్ఞవల్క్యుడు, వాల్మీకి,వేదవ్యాసులు సరస్వతి ఆరాధన వలన సనాతన ధర్మానికి ఆచార్యులైనారు.శారదాంబ రూపంలో అమ్మవారిని దర్శించుకున్న వ్యాసుడు పాపన గోదావరి తీరంలో సరస్వతి విగ్రహాన్ని సైకతమూర్తిగా మలిచితే,ఆ మహాశక్తి అందు ప్రవేశించి వాక్కు,బుద్ధి,జ్ఞానస్వరూపిణిగా విద్యార్థులను అనుగ్రహిస్తున్నది.ఆ క్షేత్రమే యాసపురియై తదుపరి వాసరయై ప్రస్తుతం బాసరగా పిలువబడుతున్నది.బ్రహ్మచే సృస్టించబడిన మానవదేహం సరస్వతి దేవి అనుగ్రహంతో చైతన్య వంతమవుతుంది.తదుపరి అక్షరాభ్యాస సంస్కారంతో అది మరింత బలపడి మనో బుద్దులను వికసింపచేస్తుంది.మంచి ఆలోచనల ప్రవాహాన్ని లోకమంతా వ్యాపింపచేస్తుంది.ఇంతటి విశిష్టతను కలిగిన సరస్వతి దేవాలయం.


GSTNWP

ఆలయం లోకి అడుగు పెట్టడానికి ముందే ఆశీర్వదించే ముగ్ధ మనోహర రూపంలో అమ్మవారి ప్రతిమ

6 months ago | [YT] | 5

GSTNWP

శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి !!

దేవి శరన్నవరాత్రులు - 2024

ఏడవ రోజు :: నిజరూప దర్శిణి గా జ్ఞానసరస్వతి మాత

శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ !
నందివనపర్తి నగరనిలయే జ్ఞానసరస్వతి నమోస్తుతే !!

1 year ago | [YT] | 10

GSTNWP

శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి

దేవి శరన్నవరాత్రులు - 2024 :: ఐదవ రోజు :: శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో జ్ఞానసరస్వతి మాత.

సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా |
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

1 year ago | [YT] | 11

GSTNWP

*శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి* !!

దేవి శరన్నవరాత్రులు :: మూడవ రోజు :: శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో జ్ఞానసరస్వతి మాత !!

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||

1 year ago | [YT] | 5

GSTNWP

*శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి* !!

*దేవి శరన్నవరాత్రులు :: రెండవ రోజు :: శ్రీ గాయత్రి దేవి అలంకరణలో జ్ఞానసరస్వతి మాత*

*ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యమ్‌*!
*భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్‌* !!

1 year ago | [YT] | 7

GSTNWP

అనుగ్రహానికి ధన్యులం🙏

ఎంత గొప్ప ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని మనందరికీ తెలిసిన విషయమే...
అలాగే ప్రారంభమయ్యే ప్రతీ కొత్త పని అనుమానాలు, అవమానాలతో మొదలై చివరకు అభినందనలతో కొనసాగుతుందనే విషయం చరిత్ర చెబుతుంది..
కొన్ని సంవత్సరాలుగా శరన్నవరాత్రి ఉత్సవాలు సాగుతున్నా... గత ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనుకున్నారు

కొంత మంది వచ్చేసారి నుండి జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలో నుండి దీక్ష తీసుకోవాలి అని..

ఇదో ఆ వచ్చే సంవత్సరం రానే వచ్చింది. అనుకున్న ప్రకారంగా కొద్ది మందితో ప్రారంభమైన అమ్మవారి కంకణధారణ, ధీక్ష... ఆలయం ద్వారా జరుగుతున్న అన్ని కార్యక్రమాలు, ఉత్సవాలకు అనుగ్రహిస్తున్న అమ్మవారు...

ఈ ధీక్షాదారులను కూడా అనుగ్రహించి, మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్ధిద్దాం..

:~ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

#spiritual #temples #hindu #hindu_temples #hindu_devotees #temple #devotee #students #schools #maasaraswathidevi #matha #maadurga #saraswathi_maa #saraswati #mahadurga #navaraathri #sharannavaratri

1 year ago | [YT] | 0

GSTNWP

దేవి శరన్నవరాత్రులు - 2024 లో అమ్మవారి అలంకరణ లు @ శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి

1 year ago | [YT] | 2

GSTNWP

శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి

*దేవి శరన్నవరాత్రులు :: మొదటి రోజు :: శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో జ్ఞానసరస్వతి మాత*

*వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరాం* |
*వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం* ||

1 year ago | [YT] | 8

GSTNWP

సాదర ఆహ్వానము💐

శ్రీశ్రీశ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు _ 2024.

ఆశ్వియజ శుద్ధ పాడ్యమి తేదీ: 03/10/2024, గురువారం నుండి ఆశ్వియుజ శుద్ధ విజయదశమి 12.10.2024 వరకు

#hindu #temples #spiritual

1 year ago | [YT] | 3

GSTNWP

కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న చదువులతల్లికి హృదయ నీరాజనం..

యాచారం వాస్తవ్యులు శ్రీ తడకమళ్ళ లక్ష్మణ్ గారి భార్య, శ్రీమతి తడకమళ్ళ శిరీష గారు ఈ మధ్య వచ్చిన గురుకుల ఉద్యోగాలలో టి.జి.టి_ ఇంగ్లీష్ గా ఉద్యోగం పొందారు.
తన మొదటి నెల వేతనాన్ని ఆలయానికి సమర్పించారు.

ఆమె మాటల్లో......

జ్ఞానసరస్వతి సేవాసమితి మాతృమండలి సభ్యురాలుని అయినా నాకు అన్ని కార్యక్రమాలకు హాజరు కావడంతో అమ్మవారిపై ప్రీతికరమైన భావన ఏర్పడింది. ప్రభుత్వ ఉపాధ్యురాయురాలుని కావాలనేది నా ఆశయం. అందులో భాగంగానే
నోటిఫికేషన్ రాగానే నా కోరికను అమ్మవారి ముందుంచి నా ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. ఉద్యోగం రాగానే మా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని నా మొదటి నెల వేతనాన్ని ఆలయ అభివృద్ధి కోసం సేవాసమితి సభ్యులకు అందజేయడం జరిగింది.

ఇక్కడి ఆలయ నిర్మాణ సంకల్పం మరియు ఆలయం ద్వారా నిరంతరంగా కొనసాగుతున్న విద్యా మహయజ్ఞానికి
నేను సైతం తోడవ్వాలని అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ "" నా మొదటి నెల వేతనాన్ని(53,299/)"" హృదయ పూర్వకంగా సమర్పిస్తున్నాను. ఇందుకోసం నన్ను ప్రొత్సహించిన మా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు..
ఆ అమ్మవారి అనుగ్రహం ముందు ముందు కూడా ఇలాగే ఉండాలని వేడుకుంటున్నాను.
____________________~___________~___________
కృషి పట్టుదలతో చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన మొదటి నెల వేతనాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన శ్రీమతి శిరీష గారికి జ్ఞానసరస్వతి సేవాసమితి తరపున శుభాభినందనలు ..

శిరీష గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగి కీర్తిమంతురాలు కావలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..

ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ సదా వెంకట్ గారు, సేవాసమితి సమన్వయ మండలి సభ్యులు మరియు మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు.

#GNANA SARASWATHI SEVASAMITHI Trust.

1 year ago | [YT] | 4