Hello everyone, welcome to my channel 🙏🌺\!/Govindam paramanandam\!/ ,🌺🙏
this channel talks about
#poojavlogs
#dailyprayer
#positivity
#motivation
#tips
#Health,
#cooking
#Lifestyle and
#vlogs
#blog
#managing relationships
#temples
#homeremedies and many more,
I will be glad if it is helpful even for some people.
Subscribe to my channel
Click the bell icon
Like our video's
Share our video's
Comment and give your valuable suggestions.
For any business enquirers contact us or for any queries on my videos or on my shorts just reach me
Email : gvnrajesh@gmail.com
🌺🙏Om Namo Narayanaya 🌺🙏
🙏Govindam Paramanandam🙏
🙏🌹🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :
9వ దివ్యదేశం.🌹🙏 @GovindamSriRangam
🙏తిరుఆదనూర్. TN🙏
@ ప్రధాన దైవం: ఆండళక్కుంమయ్యన్
@ ప్రధాన దేవత: శ్రీరంగ నాయకి
@ పుష్కరిణి: సూర్య పుష్కరిణి
@ గర్భ గుడి విమానం: ప్రణవాకార విమానము.
👉 ఈ దివ్యదేశము ...స్వామిమలై క్షేత్రం నుండి కేవలం 3 కి.మీ దూరం మాత్రమే.
🛎 స్థల పురాణం :
👉 కూర్మావతారమున శ్రీ మహావిష్ణువు మంథరగిరి పర్వతమును తన వీపుపై మోసి సముద్ర మధనం లో సహాయం చేయినప్పుడు., అమృతం లభించింది.
👉 మోహిని రూపమ ధరించి, అమృతమును మరియు అంతకు ముందు లభించిన కామధేనువు ( ఆవు ), ఐరావతము ( ఏనుగు), అమృతమును దేవతలకు మాత్రమే పంచి వారిని అమరులను చేసాడు., . ఉచ్ఛైశ్రవము ( గుర్రము ) , కల్పవృక్షము లను దేవేంద్రునకు ఇచ్చి దేవలోకమున దేవతా ముఖ్యులు తమకు నిర్దేశించిన బాధ్యతలను జగత్కళ్యాణమునకై సక్రమముగా నిర్వహించుటలో సహాయపడుటకై ఆదేశించాడు. !
👉 ఆ విధముగా ఆవిర్భవించిన కామధేనువు అను గోవు ( కోరిన సర్వమును అనుగ్రహించగల్గిన మహిమాన్విత ) ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి దర్శన మిచ్చిన కారణమున ఈ ఆదనూరు అని పేరు వచ్చెను ( ఆదన్ + ఊరు ) .
👉 చరాచర సృష్టిలో సకలముల యందు పరమాత్ముడు ఉండి . సమస్త జీవుల హృదయాంతర్గతుడై ప్రతి ప్రాణి యొక్క పుణ్య , పాప కార్యములను లిఖించుచూ ఆ ప్రకారమున మాత్రమే ఫలములను అనుగ్రహించుచున్నాడు అను భావమున ఈ దివ్య దేశమున దర్శన మిచ్చుచున్నాడు .
👉ఇక్కడ.స్వామి " ఆండు అళక్కుమ్ అయ్యన్ " అను పేరున పిలువబడుచున్నాడు .
👉 సూర్యచంద్రులే తన నేత్రములుగా కలిగి యున్న - శ్రీమన్నారాయణుడు సకల జీవుల కర్మములను గమనించు చుండును . ఆ దేవుని దృష్టి నుండి తప్పించుకొనుట ఏ ప్రాణికినీ సాధ్యము కాదు అను అర్థమున ఆదవనుల్ల ఊరు అని ఈ క్షేత్రమునకు ప్రథమమున పేరు కలిగినది .
👉పరమాత్ముని ఒక నేత్రము సూర్యుడు .. సూర్యుడు జగత్తున ప్రత్యక్ష సాక్షి . ఆ కారణముగా ఇచ్చటి పుష్కరిణికి సూర్య పుష్కరిణి అను పేరు.
👉ఆండళుక్కుమయ్యన్ ( ఆండు + అళక్కుమ్ + అయ్యన్ ) పెరుమాళ్ తూర్పుదిశముఖముగా భుజంగశయన మూర్తి ...
🌹🙏జై శ్రీమన్నారాయణ !!🙏🌹
1 day ago | [YT] | 8
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌺🙏విష్ణు సహస్రనామ స్తోత్రము శ్లోకం - 18🙏🌺🙏 @GovindamSriRangam
🙏🌺వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః🌺🌺అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః🌺🙏
వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు
వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు
సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు
వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు
మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు
మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు
అతీంద్రయ: - ఇంద్రియములద్వారా గ్రహించుటకు వీలులేనివాడు
మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు
మహోత్సాహ: - ఉత్సాహవంతుడు
మహాబల: - బలవంతులకంటెను బలవంతుడైనవాడు
🙏🌺ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు అయిన విష్ణువుకు (🙏🌹Srirangam Sri Namperumal🙏) వారికి నమస్కరిస్తున్నాను)🙏🌺🙏
1 day ago | [YT] | 6
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🌹🙏🕉 108 శ్రీవైష్ణవ దివ్య దేశాలు:
8వ దివ్య దేశము ..🙏🌹 @GovindamSriRangam
🛎 శ్రీ అప్పక్కుడతాన్ పెరుమాళ్ ఆలయం- తిరుప్పర్ నగర్, త్రిచి.
తిరుప్పేర్ నగర్ ( కోవిలాడి)
@ ప్రధాన దైవం : అప్పక్కుడుత్తాన్
@ ప్రధాన దేవి : కమలవల్లి తాయార్
@ పుష్కరిణి : కొల్లిడ0.
👉 శ్రీ అప్పక్కుడాతన్ పెరుమాళ్ ఆలయం లేదా తిరుప్పర్ నగర్ భారతదేశంలోని తమిళనాడులోని తంజావూరు నుండి 16 కి.మీ.
👉 ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది మరియు దివ్య దేశాలలో 8వది- నాలాయర దివ్య ప్రబంధంలో 12 మంది కవి సాధువులు లేదా అల్వార్లు గౌరవించే 108 విష్ణు దేవాలయాలు..కావేరి నది ఒడ్డున ఉన్న పంచరంగడి యొక్క ఐదు క్షేత్రాలలో ఇది ఒకటి.
👉పంచ రంగంలోని ఇతర క్షేత్రాలలో.
శ్రీ రంగం,
తిరు ఇందళూరు,
శ్రీ రంగపటనం,
కుంబకోణం ఉన్నాయి.
🛎 స్థల పురాణం :
👉 ఉపమన్యు మహర్షి బాలుడుగా ఉన్నప్పుడు ఆకలికి ఏడవగా శివుడు ఆ బాలునికి పాలు " తిరుప్పాత కడల్ " ( క్షీర సముద్రము ) నుండి త్రాగించెను . ఈ వృత్తాంతము శివ పురాణాంతర్గతము .
👉 క్షీర సముద్రమున శ్రీ మహావిష్ణువు అనంతశయనుడై లక్ష్మీదేవి సమేతముగా కొలువు చేసి యుండును కదా ! ఉపమన్యునకు శివుడు దర్శనమిచ్చి ఆకలి తీర్చు చున్న సమయమున శ్రీ మహావిష్ణువు కూడ ఉపమన్యునిపై అనుగ్రహించి శివునకు సహకరించి , ఉపమన్యునకు శివుని సంపూర్ణ దర్శనము కలుగు విధముగా తోడ్పడెను .
ఈ సందర్భమును వివరించునట్లుగా ఈ దివ్యదేశమున శ్రీమన్నారాయణుడు భుజంగశయన మూర్తి ( రంగనాథునిగా ) ఉపమన్యునకు వరదాన మిచ్చుచున్నట్లు కుడిచేయి ఉంచి దర్శన మిచ్చును .
👉తమిళనాడులో గ్రామములందు " అప్పము " అనునది ఒక మధుర వంటకము .
ఈ అప్పములను పాలతో ఆరగించిన ఇంకనూ రుచికరముగా ఉండును . ఉపమన్యుని కుడి చేతితో పట్టుకొని ప్రేమతో అప్పములను తినిపించు చున్నట్లుగా పెరుమాళ్ దర్శన మిచ్చుచున్నాడు .
ఆ కారణముననే పెరుమాళ్ కు ఇచ్చట అప్పములను నైవేద్యము చేయుదురు .
👉 పెరుమాళ్ ను " అప్పకుడుత్తాన్ " మరియు " అప్పుల రంగనాథన్ " అని పిలుతురు . ఈ సందర్భమున శ్రీమన్నారాయణుడు జగత్తున సర్వజనులకు బోధించు సత్యమేమనగా శివకేశవులకు ఎట్టి భేద భావమును లేదు . సర్వజనులు అదే విధముగా మతసామరస్యముతో పరస్పర సహాయ సహకారములతో ధర్మ బుద్ధితో జీవనము చేయ వలయును " , అని బోధించుచునారు
⚠️ చేరే మార్గం :
👉దీనిని "కోవిలడి" అంటారు. ఈక్షేత్రమును అన్బిల్ కొల్లడం ఎడమవైపున ఉంది. తిరుచ్చి నుండి బస్ మార్గంలో 24 కి.మీ. లాల్గుడి నుండి 10 కి.మీ. కుంభకోణం నుండి-తిరుక్కాట్టుపళ్లి-తిరువైయ్యారు బస్ మార్గమున "కల్లణై" పోవు బస్‌లోను పోవచ్చును....
🌹🙏 జై శ్రీమన్నారాయణ🙏🙏🌹
2 days ago | [YT] | 11
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌺🙏విష్ణు సహస్రనామ స్తోత్రము
శ్లోకం-17🙏🌺🙏 @GovindamSriRangam
🙏🌺ఉపేన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః🌺🌺అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః🌺🙏
ఉపేంద్రః --- ఇంద్రునిపై ఇంద్రుడు (ఇంద్రునకు అధిపతి) ; ఇంద్రునకు తమ్ముడై (వామనుడై) అవతరించినవాడు; ఇంద్రియములకు అగోచరుడు
వామనః --- పొట్టివానిగా అవతరించిన వాడు; చక్కనైన, కనులకింపైన, చూడ చిన్నదైన రూపము గలవాడు; ఇంద్ర రక్షణకు వామనావతారము దాల్చినవాడు
ప్రాంశుః --- ఎంతో ఎత్తైన, ఉన్నతమైన, విస్తారమైన దేహముగలవాడు; త్రివిక్రముడై ముల్లోకములు ఆక్రమించినవాడు
అమోఘః --- మహదాశయముతో విశేష పరిణామములు గల పనులు చేసెడివాడు; శ్రీహరి ప్రతి కార్యము విశేషించి కారణ యుక్తము, ఏదియును వ్యర్ధము కాదు, ప్రతి పనికిని పరమార్ధము ఉంది
శుచిః --- పరమ పావన మూర్తి, ఏ విధమైన దోష మాలిన్యములు అంటనివాడు; ప్రత్యుపకారమేమియును కోరని పరిశుద్ధుడు; భక్తులను పవిత్రులుగా చేయువాడు
ఊర్జితః --- అనంత శక్తి సామర్థ్య సంపన్నుడు; బలి చక్రవర్తిని పాతాళమునకు త్రొక్కిన మహాబలవంతుడు; ఐశ్వర్యము, శక్తి సంపన్నత, నిర్మలత్వము గలవన్నియును భగవద్విభూతులు (తేజోంశ సంభూతములు)
అతీంద్రః --- ఇంద్రునికంటె అధిపుడు; మనసు కంటే శ్రేష్ఠుడు
సంగ్రహః --- ప్రళయ కాలమున సమస్తమును తనయందు చేర్చుకొనువాడు; సమస్తమును కలిపి తన అధీనములో నుంచుకొన్నవాడు; సులభముగా, కేవలము భక్తి వల్లనే పొందనగువాడు (అందుబాటులో ఉండేవాడు)
సర్గః --- తనను తానే సృష్టించుకొని, తననుండి సమస్తమును సృజించినవాడు; భక్తులననుగ్రహీంచుటకు తనను తానే సృష్టించుకొనువాడు (అవతరించువాడు)
ధృతాత్మా --- సకల జీవాత్మలకును ఆధారమైనవాడు (అన్ని ఆత్మలను ధరించువాడు) ; షడ్భావ వికారములు లేనివాడు
నియమః --- శాసన కర్త; నియమములనేర్పఱచి, నియంత్రించి, నడపువాడు; భక్తుల శత్రువులను నిగ్రహించువాడు
యమః --- పరిపాలించువాడు. సమస్తమును (ప్రకృతి శక్తులను) వశము చేసుకొన్నవాడు; జీవుల హృదయములందు అంతర్యామియై నడిపించువాడు
🙏🌺ఎంతో ఎత్తైన, ఉన్నతమైన, విస్తారమైన దేహముగలవాడు; త్రివిక్రముడై ముల్లోకములు ఆక్రమించినవాడు అయిన విష్ణువుకు (🙏🌹Srirangam Sri Namperumal🙏) వారికి నమస్కరిస్తున్నాను)🙏🌺🙏
2 days ago | [YT] | 18
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🌹🙏🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు : 🙏🌹@GovindamSriRangam
7వ దివ్య దేశము.
🛎 తిరుపుల్లం పూధన్ గుడి : స్వామి మలై నుండి 3 km
@ ప్రధాన దైవం : వల్ల్విల్ రామన్(విష్ణువు) ,
@ ప్రధాన దేవత : హేమఅంబుజవల్లి తయార్ , పోత్రమారైయల్ (లక్ష్మీ)
@గర్భగుడి : శోభన విమానము
@ తీర్థము; జటాయు తీర్థము.
🛎 స్థలపురణము:
👉 శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రములో సీతా వియోగమైన తరువాత జటాయువికి అంతిమ సంస్కారాలు ఇచ్చట జరిపి ఈ స్థలంలో కొంత సేదతీరేను.
ఈ సేద తీరిన స్థలమే ఈ క్షేత్రమని నానుడి.
👉 "ఫుల్" అనగా తమిళంలో గరుడ జాతి పక్షి వంశము, ఆ కారణము చేత ఈ స్థలమునకు "పుళ్ళంపూధన్ "గుడి పేరు వచ్చింది.
శ్రీరాముడు ఇచ్చట విశ్రమించిన సమయమున ఆ గరుడ జాతి పక్షుల రాజు అయిన గరుత్మంతుడు, శ్రీరాముడి దగ్గరే ఉండి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేశారు.
ఆ భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు భుజంగ శయన మూర్తిగా దర్శనమిచ్చి అనుగ్రహించెను. అందుకే ఇక్కడ విగ్రహం శయనమూర్తి.
👉 సీత దేవిని రావణాసురుడు లంకకు గైకొని వెడలినందున ఈ క్షేత్రములో సీతా దేవి విగ్రహం లేదు.
ప్రత్యేక సన్నిది భూదేవికి మాత్రం కలదు. ఉత్సవ విగ్రహము చతుర్భుజములతో శంఖము, చక్రములతో దర్శనము ఇచ్చును.
👉 ఈ క్షేత్రమునకు 1 కి మీ. దూరములో మండంగుడి అను గ్రామము తొండరడిప్పొడి ఆళ్వార్ జన్మస్థలము. ఈ గ్రామములొ తొండరిడిప్పోడి ఆలయము, రంగనాధుని క్షేత్రము కలవు.
అక్కడి రంగనాథ స్వామి కోవిల తొండరడిప్పొడి ఆళ్వార్ జన్మస్థలము.
👉 ఇది అతి చిన్న కుగ్రామము. ఆలయము నకు రాబడి అతి తక్కువ. ఇక్కడికి అతి సమీపములో అహోబిల మట్టం బృందావనము ఉన్నది.
👉 ఈ క్షేత్రము , శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్వామిమలైకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో కలదు..
🌹🙏 జై శ్రీమన్నారాయణ 🙏🌹
3 days ago | [YT] | 16
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🌺🙏🌺విష్ణు సహస్రనామ స్తోత్రము శ్లోకం-16🙏🌺🙏@GovindamSriRangam
🙏🌺భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః🌺🌺అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః🌺🙏
భ్రాజిష్ణుః --- స్వయంప్రకాశ స్వరూపుడు; తేజోమయుడు; (సాధన చేయు, శరణాగతులైన) భక్తులకు కనిపించువాడు
భోజనం --- నోటితో గాని, జ్ఞానేంద్రియములతోగాని స్వీకరించు విషయములు (అన్నము, శబ్దము, స్పర్శ, గంధము వంటివి) అన్నియును భగవత్స్వరూపములే. ఇంద్రియముల ద్వారా గ్రహించు విషయముల రూపమునను, ఇతర పూజాదిక కార్యముల ద్వారా లభించు ఫల రూపమునను భక్తులకు ఆనందానుభూతిని ప్రసాదించువాడు; సచ్చిదానంద స్వరూపుడు
భోక్తా --- భుజించువాడు; భోజన రూపమగు ప్రకృతి లేక మాయను పురుష రూపమున అనుభవించువాడు; భక్తితో నొసగిన కానుకలు స్వీకరించి సంతుష్టుడయ్యేవాడు; యజ్ఞములో అర్పించినదానిని గ్రహించువాడు
సహిష్ణుః --- సహించి, క్షమించి, అనుగ్రహించు కరుణామయుడు; ఓర్పు కలిగి భరించు సర్వ సాక్షి, సహన మూర్తి; దుష్టులను సంహరించువాడు
జగదాదిజః --- జగములన్నింటికంటే ముందుగా నున్నవాడు
అనఘః --- పాపరహితుడు; కల్మషము లేనివాడు
విజయః --- జయించుటయే స్వభావ స్వరూపముగా గలవాడు; బ్రహ్మ రుద్రాదుల విజయములకు కూడా కారణమైనవాడు; ప్రకృతిని జయించినవాడు; పాండవులలో అర్జునుడు
జేతా --- జయించువాడు; అంతా ఆయన ఇచ్ఛానుసారమే జరుగును
విశ్వయోనిః --- విశ్వమునకు జన్మ స్థానము, కారణము; విశ్వమే కారణముగా గలవాడు
పునర్వసుః --- తన సృష్టి యందంతట సకల దైవములందును అంతరాత్మయై మరల మరల విలసిల్లువాడు; ప్రళయానంతరము మరల సృష్టి కావించువాడు
(🙏🌺జయించుటయే స్వభావ స్వరూపముగా గలవాడు; బ్రహ్మ రుద్రాదుల విజయములకు కూడా కారణమైనవాడు; ప్రకృతిని జయించినవాడు; పాండవులలో అర్జునుడు అయిన విష్ణువుకు (🌹🙏Srirangam Sri Namperumal🌺🙏) వారికి నమస్కరిస్తున్నాను)🙏🌺🙏)
3 days ago | [YT] | 17
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🕉 శ్రీవైష్ణవ దివ్యదేశము : 6వ దివ్యదేశము 🕉@GovindamSriRangam
🙏 శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ ఆలయం-
తిరువెల్లరై, త్రిచి. TN .
@ ప్రధాన దైవం : పుండరీకాక్ష పెరుమాల్
@ ప్రధాన దేవత : పంకజ వల్లి.( చంపక వల్లి)
@ పుష్కరిణి : పుష్కల తీర్థము
@ గర్భగుడి విమానం: శ్వేతాద్రి విమానం.
🛎 స్థల పురాణం :
👉తమిళనాడులోని తిరుచిరాపల్లి (త్రిచి) సమీపంలో పుండరికక్షన్ పెరుమాళ్ ఆలయం తిరువెళ్ళై లో ఉంది.
ఇది త్రిచి నుండి 27 కిలోమీటర్ల దూరంలో తురైయూర్ వెళ్ళే మార్గంలో ఉంది.
ఇక్కడ విష్ణువును పుండరీకాక్షన్, లక్ష్మిని పంకజవల్లిగా పూజిస్తారు.
👉 వెల్లరై అంటే తెల్ల రాయి అని తమిళంలో అర్థం..
ఈ స్టాలం చిన్న తెల్ల పర్వతం పైభాగంలో 100 అడుగుల ఎత్తులో ఉన్నందున ఈ స్థలాన్ని "తిరు వెల్లరై" అని పిలుస్తారు. ఇక్కడ విష్ణువు యొక్క గొప్ప భక్తుడు, పుండరికన్ ఇక్కడ ఒక తోటను ఏర్పాటు చేసి, ఇక్కడ పెరిగిన తులసి ఆకులతో భగవంతుడిని ఆరాధిస్తాడు. భగవంతుడు తన ఆరాధనతో సంతృప్తి చెంది అతనికి దర్శనం ఇచ్చాడు .
👉 పుండరీకన్ అనే భక్తుడు కంటికి కనిపించి దర్శనం ఇచ్చాడు కాబట్టి స్వామి వారిని ఇక్కడ పుండరీకాక్ష అనే పేరుతో పిలువబడుతున్నాడు.
👉 ఈ క్షేత్రమునకు శ్వేతగిరి యనిపేరు. శిబి చక్రవర్తి ప్రార్ధనచే స్వామి పుండరీకాక్షునిగా వెలిసాడు.
ఇచట స్వామికి ఇరువైపుల సూర్య చంద్రులు వింజామరలు వీస్తూ ఉంటారు.
👉 ఇచ్చట ఉత్తరాయణ-దక్షిణాయన ద్వారములు ఉన్నాయి.
👉 మీన మాసమున బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది.
🌹🙏జై శ్రీమన్నారాయణ🙏🏻🌹
4 days ago | [YT] | 6
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌺🙏విష్ణు సహస్రనామ స్తోత్రము
శ్లోకం-15🙏🌺🙏@GovindamSriRangam
🙏🌺లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృత🌺🌺చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః🙏🌺🙏
లోకాధ్యక్షః --- లోకములకు స్వామి, త్రిలోకాధిపతి
సురాధ్యక్షః --- దేవతలకు స్వామి; దేవదేవుడు
ధర్మాధ్యక్షః --- ధర్మమునకు ప్రభువు
కృతాకృతః --- ఇహపరములు రెండింటను ఫలములు ప్రసాదించువాడు; ప్రవృత్తి, నివృత్తి ధర్మములచే జీవులకు నిత్యఫలమునిచ్చువాడు; కారణ రూపమున అవ్యక్తమైనవాడు, కార్యరూపమున వ్యక్తమైనవాడు
చతురాత్మా --- సృష్టి, స్థితి, లయములందు నాలుగేసి విభుతులతో నొప్పువాడు; (నాలుగు సృష్టి విభూతులు - బ్రహ్మ, దక్షుడు మున్నగు ప్రజాపతులు, కాళము, సర్వభూతములు; నాలుగు స్థితి విభూతులు - విష్ణువు, మనువు మొదలగువారు, కాళము, సర్వభూతములు; నాలుగు లయ విభూతులు - రుద్రుడు, కాలము, యముడు, సర్వభూతములు) ; నాలుగు విధములగు సాధనావస్థలకు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలకు) ప్రభువు
చతుర్వ్యూహః --- నాలుగేసి వ్యూహములతో నొప్పువాడు (వ్యూహము = ఒక ప్రయోజనము కొరకు ఏర్పడిన ఆకారము) ; ప్రద్యుమ్న వ్యూహము - సృష్టి కార్యము నిర్వహించు ఐశ్వర్య, వీర్య సంపన్న స్వరూపము; అనిరుద్ధ వ్యూహము - స్థితికార్యము నిర్వహించు శక్తి, తేజో ప్రధాన స్వరూపము; సంకర్షణ వ్యూహము - లయ కార్యము నిర్వహించు జ్ఞాన బల గుణ ప్రధాన స్వరూపము; వాసుదేవ వ్యూహము - షడ్గుణ (జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజో) పరిపూర్ణ స్వరూపము, అనంత నిరవధిక శక్తి గుణ కాంతి సంపన్నుడు
చతుర్దంష్ట్రః --- నాలుగు కోరపండ్లు కలవాడు (అభయ ప్రదాత శ్రీనృసింహస్వామిని స్మరించు మంగళ నామము)
చతుర్భుజః --- నాలుగు బాహువులతో నొప్పువాడు; శంఖ చక్ర గదా పద్మ ధారి.
(🙏🌺నాలుగు బాహువులతో నొప్పువాడు; శంఖ చక్ర గదా పద్మ ధారి అయిన విష్ణువుకు (🙏Srirangam Sri Namperumal🙏) వారికి నమస్కరిస్తున్నాను)🙏🌺🙏
4 days ago | [YT] | 13
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌹🕉 శ్రీవైష్ణవ దివ్యదేశం : 5వ దివ్యదేశం.@GovindamSriRangam
కరంబనూర్ . ( ఉత్తమర్ కోయిల్)🌹🙏
@ ప్రధాన దైవం:పురుషోత్తమ పెరుమాళ్
@ ప్రధాన దేవత: పూర్వాదేవి తాయార్
@ పుష్కరిణి: కదంబ తీర్థము
@ గర్భాలయ విమానం : ఉద్యోగవిమానము
🛎 స్థల పురాణం :
👉 బ్రహ్మదేవునకు ముందు పంచముఖములు ఉండెవి
.తాను సృష్టికర్త అయి పంచముఖములు కలిగియుండుటతో గర్వ పడెడివాడు . ఒక సందర్భమున ఆగర్వము ఎక్కవ అయి ముక్కంటికి కోపము తెప్పించెను .
పరమశివునకు కూడ పంచముఖములే , పరమశివుని విరాట్ రూపమున నాలుగు దిక్కులు . ఊర్ధ్వము కలిపి అయిదు ముఖములు .
👉 శివుడు బ్రహ్మకు తన పంచ ముఖేశ్వర రూపమును చూపించి , సృష్టికర్తకు గర్వముండుట తగదు అని బ్రహ్మ యొక్క ముఖములలో ఒక దానిని తన గోరుతో త్రుంచి వేయగా బ్రహ్మతల శివుని చేతికి అంటుకొని ఉండిపోయినది . శివునికి బ్రహ్మ హత్యా పాతకము తగిలెను . ఎంత ప్రయత్నించిననూ ఆ తల ఊడిరాక శివుని అరచేతి యందు అంటుకొని ఉండిపోయెను .
👉 బ్రహ్మ హత్యా దోషము వలన శివుని సకల సంపదలు హరించుకొనిపోయి భిక్షాటన చేసుకొన వలసిన పరిస్థితి వచ్చినది . అరచేతిలో ఉన్న బ్రహ్మకపాలమునే భిక్షాపాత్రగా కాలము గడవుచూ పావనిష్కృతికై యోచించుచుండగా తన చేత నున్న కపాలము నిండుగా ఎప్పుడు భిక్షలభించునో , ఆ రోజు పాప నిష్కృతి అయి , ఆ కపాలము విడిపోవును అని శ్రీమన్నారాయణుని అనుగ్రహమున అశరీర వాణి వినిపించెను .
👉 అందుచేత శివుడు అన్ని ప్రదేశములు , దివ్యదేశ క్షేత్రములు అంతటా భిక్షకై తిరుగుచుండెడి వాడు . ఒక దినమున శ్రీ మహాలక్ష్మి వేసిన భిక్షతో కపాలము నిండి శివుని అరచేతి నుండి విడిపోయి ఆ కపాలము నరనారాయణ క్షేత్రమైన బదరికాశ్రమమందు అలకనంద నది ఒడ్డున పడెను .
అదే బ్రహ్మకపాల క్షేత్రముగా ఉన్నది . అక్కడ పితృదేవతలకు పిండదానము చేసినచో వారికి ఉత్తమ ఉత్తరగతులు కలుగును . ఒకసారి బ్రహ్మకపాలమున పితృదేవతలకు పిండదానము చేసినచో మరిచేయ నవసరము లేదు అని పురాణము .
👉ఈ దివ్యదేశమున శివునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహమున అశరీర దివ్యవాణి ఆ పాప నిష్కృతి వృత్తాంతమును వినిపించెను .
కావున ఈ క్షేత్రం ఒక వైష్ణవ దివ్యదేశముగా పరిగణించబడుతున్నది.
👉 ఈ ప్రదేశమున కదంబ ఋషి తపము చేసి శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యమును పొందెను . యోగి పుంగవులు ,విష్ణు భక్తాగ్రేసరులు అయిన సనక , సనందన , సనత్కుమార , సనత్సుజాతులు అను బ్రహ్మ మానస పుత్రులకు , మార్కండేయ మహర్షికి కూడ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షము అయినాడు. .
👉 ఈ స్థలపురాణము ప్రకారం ఇచ్చట పరమేశ్వర , బ్రహ్మదేవుల సన్నిధిలు కూడ కలవు . అందుచేత ఈ ఆలయము త్రిమూర్తులతో అతిశోభాయమానముగా ఉండును.
👉కదంబ మహర్షి తపస్సు చేసిన కారణంగా దీనిని " కదంబ క్షేత్రము " అని కూడా అంటారు.
🌹🙏 జై శ్రీమన్నారాయణ 🙏🌹
5 days ago | [YT] | 7
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌺🙏విష్ణు సహస్రనామ స్తోత్రము శ్లోకం-14🙏🌺🙏@GovindamSriRangam
🙏🙏సర్వగ స్సర్వవిద్భానుః విష్యక్సేనో జనార్దనః🌺🌺వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః🌺🙏
సర్వగః --- అంతటను గమనము గలవాడు
ఎక్కడైనా చేయూతనిచ్చువాడు
సర్వవిత్ --- సమస్తము తెలిసినవాడు
సమస్తమునకు పునరుజ్జీవనము ప్రసాదించువాడు (వెలుపలికి తీయువాడు)
సర్వవిద్భానుః --- (శంకరాచార్యులు ఒకేనామముగా పరిగణించిరి) సర్వము తెలిసి, అవిరామముగ, అవికారముగ ప్రకాశించేవాడు.భానుః --- ప్రకాశించువాడు
విష్వక్సేనః --- లోక రక్షణార్ధము అన్ని దిక్కులందు సైన్యము గలవాడు; తన తలంపు మాత్రమున సర్వదానవ సైన్యమును నాశనము చేయువాడు
జనార్దనః --- దుష్టులను శిక్షించువాడు; దుష్టుల బారినుండి సజ్జనులను రక్షించువాడు; భక్తుల రక్షణలో విఘ్నములు కలిగించువారిని పరిమార్చువాడు; కామితార్ధములకై భక్తులు ఎవరిని ఆశ్రయింతురో ఆ దేవుడు
వేదః --- సమస్త జ్ఞానము మూర్తీభవించినవాడు; వేదమూర్తి
వేదవిత్ --- వేదములను, వాని సారము (అర్థమును) సంపూర్ణముగా నెరిగినవాడు; వేదజ్ఞానము బోధీంచువాడు
అవ్యఞ్గః --- ఏ విధమైన లోపములు లేనివాడు (వేద జ్ఞానమందు, గుణ వైభవమునందు)వేదాంగములు తానే అయినవాడు
వేదాఞ్గః --- వేదములే శరీరముగా (అంగములుగా) గలవాడు; వేదమూర్తి.
వేదవిత్ --- వేదములనెఱుగుటయే గాక, వేదసారమైన ధర్మమునెరిగినవాడు
.కవిః --- సామాన్య దృష్టినధిగమించి, సునిశిత దర్శనము (సూక్ష్మ దృష్టి) కలిగిన వాడు; సకలమును దర్శించువాడు; రమ్యముగా కనుపించువాడు
(🌺🙏🌺దుష్టులను శిక్షించువాడు; దుష్టుల బారినుండి సజ్జనులను రక్షించువాడు; భక్తుల రక్షణలో విఘ్నములు కలిగించువారిని పరిమార్చువాడు; కామితార్ధములకై భక్తులు ఎవరిని ఆశ్రయింతురో ఆ దేవుడు అయిన విష్ణువుకు (🙏Srirangam Sri Namperumal🙏) వారికి నమస్కరిస్తున్నాను) 🙏🌺🙏
5 days ago | [YT] | 17
View 0 replies
Load more