Hello everyone, welcome to my channel 🙏🌺\!/Govindam paramanandam\!/ ,🌺🙏
this channel talks about
#poojavlogs
#dailyprayer
#positivity
#motivation
#tips
#Health,
#cooking
#Lifestyle and
#vlogs
#blog
#managing relationships
#temples
#homeremedies and many more,
I will be glad if it is helpful even for some people.
Subscribe to my channel
Click the bell icon
Like our video's
Share our video's
Comment and give your valuable suggestions.
For any business enquirers contact us or for any queries on my videos or on my shorts just reach me
Email : gvnrajesh@gmail.com
🌺🙏Om Namo Narayanaya 🌺🙏
🙏Govindam Paramanandam🙏
🙏🌹🕉 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలు :14వ దివ్యదేశము. @GovindamSriRangam
🙏శారంగపాణి దేవాలయం.. (తిరుక్కుడందై)
కుంభకోణం 🌹🙏
@ ప్రధాన దైవం : : శారంగపాణి పెరుమాళ్
@ ప్రధాన దేవత : : కోమలవల్లి తాయార్
@ పుష్కరిణి :: హేమపుష్కరిణి
@ గర్భగుడి విమానం :: వైదిక విమానము
🛎కుంభకోణం ఆలయ చరిత్ర :
👉ప్రళయ కాలంలో బ్రహ్మ.. భూమిపై తన సృష్టి కార్యంని పునసృష్టి చేయడానికి అవసరమైన వేదాలు, అమృతం మరియు ఇతర పరికరాలు భద్రపరచడానికి బ్రహ్మ ఒక బురద కుండను సృష్టించి, మేరు పర్వతం పైన భద్రత కోసం వదిలివేసిరి. అయినప్పటికీ ప్రకృతి శక్తి కుండను విడిచిపెట్టలేదు మరియు వరదలో కొట్టుకుపోయింది. కుండ ఆగ్నేయ దిశలో కదిలి ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంది.
వరదలు తగ్గిన తరువాత, జీవితం ప్రారంభమయ్యే విధంగా దేవతలు వేదాలు, అమృతం విడుదల చేయాలని శివుడిని వేడుకున్నారు.
శివుడు స్వర్గం నుండి బాణంతో కుండ తెరిచాడు.
ఆ దెబ్బకి కుండ పగిలిపోయింది. అమృతం కుండ నుండి ప్రవహించి రెండు నీటి కొలనులను ఏర్పాటు చేసింది, ఇది ఇప్పుడు మహా "మహాకులం" మరియు "పోత్రమారై కులం" అనే పేరుతో వెలిశాయి.
👉కుండ ముక్కలు అమృతంతో కలిసిపోయి ఒక లింగంగా మారి... అందు శివుడు వెలిసేను, అదే కుంబేశ్వరుడు అని నామము కలిగి.. ఈ దైవిక సంఘటన చోటు ఇప్పుడు కుంబకోణం అని పిలువబడుతుంది. ఇది కుంభకోణం చరిత్ర
🛎 శారంగపాణి ఆలయ చరిత్ర ::
👉స్కాంద, భవిష్యోత్తర పురాణం ప్రకారం త్రిమూర్తులలో గొప్ప వారు ఎవరు , యాగభోక్త ఎవరు..ఆ నైవేద్యం ఎవరికి సమర్పిస్తారనే దానిపై రుషుల మధ్య వాదన తలెత్తింది. రుషుల నిర్ణయించలేక భృగు మహర్షిని పంపించారు.
భృగు మహర్షి కైలాసం,బ్రహ్మలోకo వెళ్లి అగౌరవంతో వ్యవహరించాడు.
ఆ తర్వాత విష్ణులోకo వెళ్ళాడు.
కోపంతో మహర్షి తన పాదంతో శ్రీ మహావిష్ణువును తన ఛాతీలో తన్నాడు!
👉ఆ చర్యకు అలిగిన శ్రీమహాలక్ష్మి , వైకుంఠం వదిలేయ్ కొల్హాపూర్లో తపస్సు చేసుకుంటూ గడిపింది.
శ్రీమహావిష్ణువు కూడా వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా మారి లక్ష్మి అంశతో జన్మించిన పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు.
👉నారదుని ద్వారా శ్రీమహావిష్ణువుకు అంతకుముందే శ్రీ మహాలక్ష్మి తో పెళ్లి జరిగింది అన్న విషయం తెలుసుకున్న పద్మావతి , అలిగి తిరుచానూరు అనే క్షేత్రంకి వెళ్ళిపోయింది..
శ్రీ మహావిష్ణువు పాతాళ లోకముకు వెళ్ళిపోయాడు.
ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి.... అటు శ్రీనివాసుడు మరియు పద్మావతి ఎక్కడికో వెళ్ళిపోయారు అన్న విషయం తెలుసుకొని ఇద్దరిని వెతుకుతూ ఒక చిన్న బలికగా మారి "పొట్ర మరై" అనే కొలనులో బంగురుచుండగా ఒక మహర్షి చూశాడు. ఆయన ఎవరో కాదు భృగు మహర్షి.
👉త్రిమూర్తుల పట్ల తన ప్రవర్తనకి సిగ్గుపడి ప్రాయశ్చిత్తం కొరకు "హేమమహర్షి" అనే పేరుతో తపస్సు చేసుకుంటున్నాడు.
ఆ బాలిక ని తన పెంపుడు కూతురుగా అల్లారుముద్దుగా "కోమలవల్లి "అనే పేరుతో పెంచి పెద్ద చేసి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పెళ్లి జరిపించాడు.
👉శ్రీ మహా విష్ణువు ని పెళ్లి చేసుకోవడం లోపల ఇష్టంగానే ఉన్నా బయటికి అలక నటించింది కోమలవల్లి. అందుకే ఈ క్షేత్రంలో స్వామి ఆదిశేషునిపై శయన భంగిమలో కాకుండా అమ్మవారిని బ్రతిమాలడం కోసం కొంచం లెగిచి వెళ్తున్నట్టుగా ఉంటుంది...
🙏ఓం నమో కుంభేశ్వరాయ నమః🙏
🙏ఓం నమో శారంగపాణి నమః🙏
🙏జై శ్రీమన్నారాయణ 🙏
5 hours ago | [YT] | 6
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌺విష్ణు సహస్రనామం శ్లోకం - 26🌺🙏@GovindamSriRangam
🙏🌺సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృగ్విశ్వభుగ్విభుః🌺🌺సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నాయణో నరః|🌺🙏
సుప్రసాదః --- అనంతమైన దయగలవాడు; అనుగ్రహ స్వరూపుడు; శుభకరమగు ఫలములను ప్రసాదించువాడు
ప్రసన్నాత్మా --- సర్వకాల సర్వావస్థలయందును ప్రసన్నమైన, ప్రశాంతమైన మనసు గలవాడు; రాగాదులచే ప్రభావితము కానివాడు
విశ్వసృట్, విశ్వసృడ్ --- విశ్వమును సృజించినవాడు
విశ్వధృగ్ --- విశ్వమును తన అధీనములో ధరించి, బాగోగులు గమనించువాడు.
(పాఠాంతరములు)
విశ్వసృగ్, విశ్వసృష్ట్విశ్వభుగ్విభుః --- 'విశ్వ భుగ్ విభుః' అంతటను వ్యాపించి అన్నింటిని రక్షించువాడు
శంకరాచార్యులు రెండు వేరువేరు నామములుగా వ్యాఖ్యానించిరి
విశ్వభుగ్ --- జీవరూపమున విశ్వమును అనుభవించువాడు, భక్షించువాడు; అన్ని అనుభూతులను తనయందు లీనము చేసికొనును; అన్ని దిశలందును విస్తరించి విశ్వమును ఏర్పరచాడు
విభుః --- హిరణ్య గర్భుడై, మరియు అనేక రూపములు ధరించి, విశ్వమంతయును నిండి వెలుగుచున్న పరమేశ్వరుడు; సర్వము తానె యైనవాడు; అన్ని చోట్ల అన్నింటిని నింపువాడు; విశ్వమునకు ప్రభువు
సత్కర్తా --- సజ్జనులను, పుణ్యవర్తనులను, ధర్మాత్ములను ఆదరించువాడు, సత్కరించువాడు
సత్కృతః --- పూజనీయులచేత కూడా పూజింపబడువాడు; లోకైక పూజ్యుడు
సాధుః --- (భక్తుల క్షేమమునకు అవుసరమైన పనిని) సాధించువాడు; సాధువర్తనుడు, సదాచార సంపన్నుడు
జహ్నుః --- గుహ్యమైనవాడు, కానరానివాడు (మూఢులను విడనాడువాడు) ; ప్రళయకాలమున సమస్తమును లయము చేయువాడు; దోషులకు దూరముగానుండువాడు
నారాయణః --- సకలాత్మలకు ఆధారమైనవాడు, జీవసముదాయములకు ఆశ్రయుడు; జగత్తంతయును (లోపల, వెలుపల) వ్యాపించియున్నవాడు; జలములకు (నారములకు) ఆధారము, జలములే నివాసము అయినవాడు; ప్రళయకాలమున జీవులకు నిలయమగువాడు
నరః --- నాశనము (తుది) లేనివాడు; నడపించువాడు, నాయకుడు; నిత్యమగు చేతనాచేతనములకు విభూతిగా గలవాడు; జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడపువాడు
🙏🌺పూజనీయులచేత కూడా పూజింపబడువాడు; లోకైక పూజ్యుడు అయిన విష్ణువుకు (🙏🌹Srirangam Sri Namperumal🙏) వారికి నమస్కరిస్తున్నాను)🙏🌺🙏
6 hours ago | [YT] | 4
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌹🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు : 13వ దివ్యదేశం. 🌹🙏 @GovindamSriRangam
తలైచ్చన్‌గాడ్ TN.
@ ప్రధాన దైవం: నాణ్మదియప్పెరుమాళ్
@ ప్రధాన దేవత: తలైచ్చంగ నాచ్చియార్, శెంగమలవల్లి తాయార్
@ పుష్కరిణి: చంద్ర పుష్కరిణి
@ గర్భ గుడి విమానం: చంద్ర విమానము
👉దక్ష ప్రజాపతిచే శాపానికి గురైనాడు
చంద్రుడు..,,తన శాపవిమోచన విధానం తెలుపవలసిందిగా శ్రీ మహావిష్ణువు ని ప్రార్ధించి... ఆయన సలహాపై పరమశివుని ప్రసన్నుడిని చేసుకొని, శివుని శిరస్సుపై అర్థ చంద్రాకారం లో నిలిచి ఉన్నాడు.
👉శ్రీ మహావిష్ణువు, శాపవిమోచననికి ఒక దారిని అనుగ్రహించిన కారణంగా , పరమేశ్వరుడు వలె శ్రీ మహా విష్ణువు కూడా చంద్రుని ఇక్కడ తన తలపై మోస్తున్నాడు కనుక...ఇక్కడ స్వామివారిని" చంద్ర శాపహార మూర్తి"గా అభివర్ణిస్తారు.
👉 ఒకప్పుడు ఈ ప్రదేశంలో వివిధ ప్రదేశాల నుండి తీసుకొచ్చిన గొప్ప గొప్ప శంఖములను తెచ్చి ఇక్కడ అమ్మకం చేసేవారు.
👉తలై శంక్ అనగా గొప్ప శంఖము, కాడు అనగా అడవి అని అర్థము.. ఆ విధముగా తలై శాంక్కడు అని పేరు వచ్చి ప్రస్తుతం తలైచంగాడు అని పిలవబడుతున్న ఈ దివ్య దేశంలో పరమశివుడు వలే శ్రీ మహా విష్ణువు కూడా తలలో చంద్రుని ధరించి ఉన్నాడు
👉 ఇక్కడ స్వామివారి విగ్రహం వద్ద ఉన్న శంఖము చాలా గొప్పది .
అమ్మవారి విగ్రహం చాలా అందమైనది.
👉మాయవరం నుండి అక్కూర్ చేరి అట నుండి శీర్గాళిపోవు మార్గములో 3 కి.మీ దూరమున సన్నిధి కలదు. తలచ్చంగాడ్ అని చెప్పాలి.
🙏🌹జై శ్రీమన్నారాయణ 🙏🌹
1 day ago | [YT] | 16
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌺🙏విష్ణు సహస్రనామం శ్లోకం - 25🙏🌺🙏 @GovindamSriRangam
🙏🌺ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః🌺🌺అహస్సంవర్తకో వహ్ని రనిలోధరణీధరః 🌺🙏
ఆవర్తనః --- సంసార చక్రమును పరిభ్రమింపజేయువాడు
నివృత్తాత్మా --- (231, 454, 604, 780 నామములు) అన్నింటికంటె మహోన్నతమగు పరమపద తత్వమూర్తి; సంసార చక్రమును త్రిప్పువాడైనను కోర్కెలకు అతీతుడైనవాడు, మాయాతీతుడు; నివృత్తి ధర్మమును పాటించువారికి ఆత్మస్వరూపుడు; సంసార బంధములకు అతీతుడు; నిత్యవిభూతి యనెడు స్వరూపము గలవాడు
సంవృతః --- కప్పబడియుండువాడు (తెలియజాలనివాడు) ; తమోగుణముచే మూఢులగువారికి కన్పించనివాడు; అజ్ఞానులైన మానవుల దృష్టికి మృగ్యుడై యున్నవాడు
సంప్రమర్దనః --- చీకటిని, అజ్ఞానమును, మాయను పారద్రోలువాడు; (రుద్రుడు, యముడు వంటి రూపములలో) దండించువాడు; దుష్టులను మర్దించువాడు (హింసించు వాడు)
అహఃసంవర్తకః --- సూర్యుని రూపముననుండి దినములను (కాల చక్రమును) చక్కగా ప్రవర్తింపజేయువాడు
వహ్నిః --- సమస్తమును వహించువాడు (భరించువాడు) ; దేవతలకు హవిస్సునందించు అగ్నిహోత్రుడు
అనిలః --- (236, 818 నామములు) వాయువు; ప్రాణమునకు ఆధారమైన ఊపిరి; ప్రేరణ లేకుండానే (వేరెవరు చెప్పకుండానే) భక్తుల కోర్కెలు తీర్చువాడు; ఆది లేనివాడు (తానే స్వయముగా ఆది.) ; సంగమము (బంధము) లేకుండా, మంచి చెడులకు అతీతమైనవాడు; కరిగిపోనివాడు; సర్వజ్ఞుడు; భక్తులకు సులభముగా అందువాడు; స్థిరమైన నివాసము (నిలయము) లేనివాడు; ఇల (భూమి) ఆధారము అవుసరము లేనివాడు; అన్నిచోట్ల ఉండువాడు (ఎక్కడో దాగని వాడు) ; సదా జాగరూకుడైనవాడు
ధరణీధరః --- భూమిని ధరించువాడు (భరించువాడు, పోషించువాడు)
🙏🌺సమస్తమును వహించువాడు (భరించువాడు) ; దేవతలకు హవిస్సునందించు అగ్నిహోత్రుడు అయిన విష్ణువుకు (🙏🌹 Srirangam Sri Namperumal🙏) వారికి నమస్కరిస్తున్నాను)🙏🌺🙏
1 day ago | [YT] | 11
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🕉 108 శ్రీవైష్ణవ దివ్య దేశాలు : 12వ దివ్య దేశము.🕉
🙏 తిరుచ్చేరై. ( సార క్షేత్రం)🙏 @GovindamSriRangam
👉ఆలయంలో స్వామి విగ్రహం నిలుచున్న భంగిమలో ఉంది.
@ ప్రధాన దైవం: సారనాథ పెరుమాళ్
@ ప్రధాన దేవత: సారనాయకి
@ పుష్కరిణి: సార పుష్కరణి
@ గర్భాలయ.విమానం:సార విమానము
🛎 స్థలపురాణము :
👉మహాప్రళయ కాలములో యుగాంతమున , సృష్టికార్యము కొరకు ఉపయోగించుకొను తన ఉపకరణములను , వేదములను అమృత భాండమును సృష్టి కర్త బ్రహ్మదేవుడు ఒక పెద్ద కుండలో ఉంచి మేరు పర్వత శిఖరాగ్రమున ఉంచినారు.
👉ఆ పెద్ద కుండను తయారుచేయడానికి ఎన్నో ప్రదేశాలు మట్టిని పరీక్షించి, చివరకి శ్రీమన్నారాయణుడి ఆదేశంతో ఈ " తిరుచేరేయ్" ప్రదేశం మట్టిని పరీక్షించి, కుండని తయారు చేశారు.!
అట్టి మహిమాన్వితమైన మట్టి కలిగియుండిన కారణమున ఈ ప్రదేశమునకు " సార క్షేత్రం" అని పేరు కలిగింది.
👉 ఆలయపు రాజగోపురము 120 అడుగుల ఎత్తుకలది . మధ్య గోపురము, తరువాత వచ్చే కళ్యాణ మండపము లో రాజగోపాల స్వామి సన్నిధి కలదు .
సన్నిధి ఎదురుగా తిరు వేంకటముదయన్ సన్నిధి , శ్రీరామ , నరసింహ, మణవాళమునిల సన్నిధిలు కలవు .
⚠️రవాణా :
👉కుంభకోణము నుండి కూడవాశల్ పోవు టౌన్‌బస్‌లో 12 కి.మీ. దూరమున గలదు. సత్రములు హోటళ్లు గలవు. ఉప్పిలియప్పన్(తిరువిణ్ణగర్) సన్నిధి నుండి ,నాచ్చియార్ కోయిల్ నుండియు కూడ పోవచ్చును.
ఈ క్షేత్రమునకు 5 కి.మీలో నాచ్చియార్ కోయిల్...
🌹🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🌹
2 days ago (edited) | [YT] | 19
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌺🙏విష్ణు సహస్రనామ స్తోత్రము
శ్లోకం 24🙏🌺🙏 @govi
🙏🌺అగ్రణీర్ద్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః🌺🌺సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్||🌺🙏
అగ్రణీః --- ముందుండి గమ్యస్థానమునకు దారిచూపువాడు, భక్తులకు ఉత్తమగతికి మార్గము చూపువాడు, మార్గదర్శి
గ్రామణిః --- సకల సముదాయములకు (సామాన్యజీవులకు, దేవతలకు, ముముక్షువులకు) నాయకుడు; అందరికిని మోక్షమార్గము చూపు పెద్దదిక్కు; సత్యసూరులకు నాధుడు
శ్రీమాన్ --- (22, 180, 222వ నామములు) శ్రీ అనగా కాంతి, తేజస్సు, వైభవము, సంపద; సకల సంపదలు మూర్తీభవించిన మూర్తి, సిరిగలవాడు; సమస్త వైభవము గలవాడు, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తి గలవాడు; ప్రకాశించువాడు, తేజోమూర్తి; శ్రీమహాలక్ష్మీపతి; వక్షస్థలమున శ్రీదేవిని నిలుపుకొన్నవాడు; సకల శక్తిమంతుడు. 'శ్రీ' అనగా లక్ష్మీదేవి. సదా లక్ష్మీదేవితో కూడి యుండువాడు - విష్ణుమూర్తి. ఆదిదేవుని వక్షస్థలమున లక్ష్మీదేవి సదా వసించుచుండెను. లక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరియించిన ఆదిదేవుడు. 'వక్షస్థలము' హృదయమును సూచించుటచే హృదయములో కల్యాణ సంపద కలిగియున్నవాడని భావము
న్యాయః --- భక్తులకు తగురీతిలో (మోక్ష) ఫలము ప్రసాదించువాడు; పరబ్రహ్మజ్ఞానమునకు దారిచూపు తర్ము, యుక్తి; విశ్వమందు అంతటిని సక్రమముగా నియమముగా నడుపు శక్తి
నేతా --- భక్తుల కోరికలను తీర్చువాడు; విశ్వమునందన్ని వ్యవహారములను నిర్వహించు అధికారి; భక్తులను తన నేతృత్వములో సన్మార్గ మోక్షమార్గములకు చేర్చువాడు
సమీరణః --- అద్భుతమైన, మనోహరమైన కార్యములను నిర్వర్తించువాడు; ప్రాణమునకు కావలసిన వాయువు తానే అయి ఉన్నవాడు; సకల జీవుల శ్వాసను, తదితర చైతన్యమును నడపువాడు
సహస్రమూర్ధా --- వేయి (లెక్క పెట్టలేనన్ని) శిరసులు గలవాడు;అంతటను ఉండువాడు
విశ్వాత్మా --- విశ్వమునకే ఆత్మ; సకల భూతములకును అంతస్థితుడైన ఆద్యుడు
సహస్రాక్షః --- వేయి (లెక్క పెట్టలేనన్ని) కన్నులు గలవాడు; అంతటిని చూచుచుండువాడు
సహస్రపాత్ --- వేయి (లెక్క పెట్టలేనన్ని) పాదములు గలవాడు; అన్ని చోట్ల చరించువాడు
🌺🙏లక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరియించిన ఆదిదేవుడు. 'వక్షస్థలము' హృదయమును సూచించుటచే హృదయములో కల్యాణ సంపద కలిగియున్నవాడని భావము అయిన విష్ణువుకు (🙏🌹Srirangam Sri Namperumal🙏) వారికి నమస్కరిస్తున్నాను)🙏🌺🙏
2 days ago | [YT] | 13
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🙏🌺🙏విష్ణు సహస్రనామ స్తోత్రము శ్లోకం 22🙏🌺🙏 @GovindamSriRangam
🙏🌺అమృత్యు స్సర్వదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్ స్ధిరః🌺🌺అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా🌺🙏
అమృత్యుః --- మరణము గాని, నాసనము గాని లేనివాడు
సర్వదృక్ --- విశ్వ దర్శియై మహాజ్ఞానముతో జీవులు చేయు సర్వ కర్మలు చూచుచుండువాడు
సింహః ---సింహము; నరసింహావతారము; పాపములను నశింపజేయువాడు
సంధాతా --- జీవులను వారి కర్మఫలములకు ముడివేయు (అనుసంధానించు) వాడు; నిత్యము ఆశ్రితులను చేరదీయువాడు
సంధిమాన్ --- భక్తులందు ఐక్యమై యుండువాడు; తాను స్వయముగా జీవరూపుడై కర్మఫలములను అనుభవించువాడు
స్థిరః --- భక్తుల పట్ల బాంధవ్యము నిలకడగా గలాడు; నిశ్చలుడు, నిర్వికారుడు, నిత్యుడు
అజః --- పుట్టుకలేనివాడు (స్తంభమునుండి అవతరించిన శ్రీనారసింహమూర్తి) ; అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించువాడు; భక్తుల మనములోని అజ్ఞానము హరించువాడు; సకల శబ్దములకును మూలము ('అ'కారము)
దుర్మర్షణః --- ఎదురులేనివాడు, అడ్డులేనివాడు; అసురులకు భరింపశక్యముగాని వాడు
శాస్తా --- బోధించువాడు, జగద్గురువు; శాసించువాడు, భక్తుల మార్గము నవరోధించువారిని శిక్షించువాడు
విశ్రుతాత్మా --- జగమంతయు విస్తృతముగా ఎవరి అద్భుత లీలా మహాత్మ్యములను గానము చేయునో ఆ దేవదేవుడు; సత్యము, జ్ఞానము, పరబ్రహ్మము - ఇత్యాది విశిష్ట నామములచే స్తుతింపబడు అనంతగుణ సంపన్నుడు; వివిధ స్వరూపములుగా కీర్తింపబడు సహస్రమూర్తి; విశేష, షడ్గుణ్య పరిపూర్ణ, పరమాత్మ
సురారిహా --- దేవతల శతృవులను హరించువాడు
🙏🌺సింహము; నరసింహావతారము; పాపములను నశింపజేయువాడు అయిన విష్ణువుకు (🙏🌹 Srirangam sri Namperumal🙏) వారికి నమస్కరిస్తున్నాను)🙏🌺🙏
3 days ago | [YT] | 20
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🌹🙏🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు:
11వ దివ్య దేశము.🙏🌹 @GovindamSriRangam
🙏 శిరుపులియూర్ 🙏
@ ప్రధాన దైవం: అరుళ్మాకడల్ పెరుమాళ్
@ప్రధాన దేవత: తిరుమామకళ్ నాచ్చియార్
@పుష్కరిణి: మానసపుష్కరిణి
@గర్భగుడి విమానం: నందవర్దన విమానము
👉 శ్రీ కృపాసముద్ర పెరుమాళ్ ఆలయం (అదనంగా శ్రీ అరుల్మాకదల్ పెరుమాల్ ఆలయం అని కూడా పిలుస్తారు)
🛎 స్థల పురాణం :
👉మధ్యానందన మహర్షి కుమారుడైన గౌతమ మహర్షి పరమేశ్వరుని గురించి తపస్సు చేసి తన చేతివ్రేళ్ల మొనలలో కళ్లు , వ్యాఘ్ర నఖముల వంటి నఖములను అనుగ్రహించమని ప్రార్ధించెను .
👉అందువలన ఆ మహర్షికి వ్యాఘ్రపాదుడు అని పేరు . ఈ మహర్షి వశిష్ఠ మహర్షి సోదరిని వివాహమాడి ఉపమన్యునకు జన్మనిచ్చెను . వ్యాఘ్రపాదుడు చిదంబరంలో పరమశివుని అమిత భక్తితో పూజించుచు తపస్సు చేయుచుండెను
👉ఆదిశేషుని తనయుడు పతంజలి చిదంబరంలో శివుని దివ్యనాట్యమును వ్యాఘ్రపాద మహర్షితో పాటు దర్శించెను . పరమశివుడు వ్యాఘ్రపాదుని అనుగ్రహించి . మరియు , సిరుప్పులియూరు దివ్యదేశములో శ్రీమహావిష్ణువునకై తపస్సు చేసి వైకుంఠమును చేరుము అని అదేశించెను . ఆ విధముగా ఈ దివ్యదేశము పేరు పొందినది .
👉 ఇచ్చట పెరుమాళ్ మూలవిరాట్ పాదముల వద్ద వ్యాఘ్రపాద మహర్షిని చూడగలము .
ఈ దివ్య దేశమున పెరుమాళ్ ఆదిశేషుని గరుడిని బారి నుండి రక్షించెను .
👉 ఇచ్చటి పెరుమాళ్ చాల చిన్నమూర్తి రూపమున ఉండి దర్శన మిచ్చుచుండుటచే తిరుమంగై ఆళ్వార్ దర్శించి ఖిన్నుడైనందు వలన, పెరుమాళ్ ఆళ్వార్ ను " తిరుక్కణ్ణమంగై ( ది.దే .27 ) పోయి అచ్చట వెలసి యున్న బృహత్ మూర్తి దర్శనము చేసి ఆనందము పొందుము అని చెప్పెను .
👉 తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో మాయవారానికి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరుపులియూర్ లో ఉంది. మూలావర్ శ్రీ అరుల్మాకడల్ అముదం / స్థల శయన పెరుమాళ్, థాయర్ తిరుమాగల్ నాచియార్.
👉 దక్షిణాది (శ్రీరంగంలో శ్రీ రంగనాథర్ లాగా) శయన బేరంగా, పడుకోని మూలవర్ తన భక్తులను ఆశీర్వదిస్తాడు.
🌹🙏జై శ్రీమన్నారాయణ 🙏🌹
3 days ago | [YT] | 18
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🌺🙏🌺విష్ణు సహస్రనామ స్తోత్రము
శ్లోకం 21🌺🙏🌺 @GovindamSriRangam
🌺🙏మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః🌺🌺హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః🌺🙏
మరీచిః --- కాంతి, కిరణము, తేజోమయుడు; తేజోవంతులలో దివ్యతేజోమూర్తి
దమనః --- సంసార భారమును తొలగించి, బంధ విముక్తినొసగువాడు; అధర్మమార్గమున చరించువారిని శిక్షించువాడు; తన దివ్య తేజస్సుచే సమస్త ప్రాణుల తాపములను హరించువాడు
హంసః --- భక్తులకు సంసార భయమును పోగొట్టువాడు; హంసవంటి గుణములు గలవాడు, హంసావతారమును ధరించినవాడు; సోహం అని తెలిపిన పరబ్రహ్మము; అన్ని శరీరములందలి అంతర్యామి
సుపర్ణః --- చక్కనైన రెక్కలు గలవాడు (గరుత్మంతుడు, హంస) ; జ్ఞానము, కర్మ అను అందమైన రెక్కలనధిరోహింపజేసి సంసార సాగరమును తరింపజేయువాడు
భుజగోత్తమః --- ఆదిశేషునకు ప్రభువు, శేషశాయి; సర్పములలో ఉత్తముడు (అనంతుడు, వాసుకి) ; వ్యాపనము, చలనము కలిగినవానిలో ఉత్తముడు (సర్వవ్యాపి)
హిరణ్యనాభః --- బంగారమువంటి, కళ్యాణప్రథము, మనోహరమునగు నాభియందు చతుర్ముఖ బ్రహ్మకు ఆధారమైనవాడు; బ్రహ్మను కన్న తండ్రి
సుతపాః --- అత్యుత్తమ జ్ఞానమునకు ఆలవాలము; మూర్తీభవించిన తపము; బదరికాశ్రమమున నరనారాయణ రూపమున గొప్ప తపసు నాచరించినవాడు
పద్మనాభః --- బొడ్డు తామరపూవు గలవాడు (బ్రహ్మకు జన్మస్థానము) ; అందరి హృదయ కమలములందు వసించువాడు; జ్ఞానమునకు నిలయము; బహు మనోహరుడు
ప్రజాపతిః --- సకలజీవులకును ప్రభువు; బ్రహ్మాదులకు ప్రభువు
🙏🌺ఆదిశేషునకు ప్రభువు, శేషశాయి; సర్పములలో ఉత్తముడు (అనంతుడు, వాసుకి) ; వ్యాపనము, చలనము కలిగినవానిలో ఉత్తముడు (సర్వవ్యాపి) అయిన విష్ణువుకు (🙏🌺srirangam sri Namperumal🌺🙏) వారికి నమస్కరిస్తున్నాను)🙏🌺🙏
4 days ago | [YT] | 15
View 0 replies
🙏Govindam Paramanandam🙏
🌹🙏🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :
10వ దివ్యదేశము.🙏🌹@GovindamSriRangam
🙏తిరుఅళ్ళుందూర్ : " దేవాదిరాజన్" " ఆమరువియప్పన్" కోయిల్. 🙏
🛎 స్థల పురాణము:
👉 కృష్ణుడు పశువులను మేపుతున్నప్పుడు బ్రహ్మ ఆ పశువులను మాయము చేసెను. కృష్ణుడు ఈ విషయము తెలుసుకొని తన మాయతో వేరొక పశువుల మందను సృష్టించేను.
బ్రహ్మ కృష్ణుడుని క్షమాభిక్ష వేడుకొని ఈ స్థలము నందు నివాసము
ఏర్పర్చుకొని ఉండమని అభ్యర్ధించెను.
👉 శ్రీ కృష్ణుడు మాయా గోవులను సృష్టించిన సందర్భానికి గుర్తుగా ఇక్కడ అ ఉత్సవమూర్తి పాదముల దగ్గర అందమైన ఆవు దూడ 1 ఉంటుంది
👉 దేవగురువు అయిన బృహస్పతికి శిష్యుడు- " ఉపరిచరవసు " అను రాజు చేది రాజ్యమును ఏకపత్నీవ్రతుడై , ధర్మవర్తనుడై అమిత జనరంజకముగా పాలించుచుండిన కాలములో ఒక విషయమున దేవతలకు, ఋషులకు కలిగిన భిన్నాభిప్రాయములో నిమంత్రితుడై దేవసభకు పోయి దేవతల పక్షమున తీర్పునిచ్చెను .
దేవేంద్రుడు ప్రశంసించి ఆకాశగమనము చేయు ఒక రథమును బహూకరించగా " ఉపరిచరవసువు " ఆ రథమున ఆకాశమున పోవుచుండగా ఋషులు కోపముతో ఆ రథము ఆకాశములో ఆగిపోవునట్లుగా శపించిరి .
అంతట ఉపరిచరవసు రాజు ఈ ప్రదేశమున ఆకాశము నుండి పడిపోయి పెరుమాళ్ ను ప్రార్థించెను . ఆ ప్రార్థనకు సంతసించి పెరుమాళ్ గరుడుని పంపి రథమును తిరిగి గమన యోగ్యముగా చేయుమని ఆదేశించెను . గరుడుని సహాయమున రథము తిరిగి గమనశక్తిని పొందెను . ఉపరిచరవసు రాజును పెరుమాళ్ అనుగ్రహించెను . దేవతల ప్రియుడైన మానవరాజును అనుగ్రహించిన కారణమున పెరుమాళను ఇచ్చట " దేవాధిరాజన్ " అను నామమున కొలుచుదురు .
👉 తిరుమంగై ఆళ్వార్ ఒకసారి ఈ ఆలయం మీదుగా వెళుతూ" దేవాదిరాజన్" పేరు విని ఆయన ఒక రాజని తలచి మంగళాశాసనము చేయకుండ వెళ్ళిపోతుంటే ఆ పరమాత్మ ఆ ఆళ్వార్ వారిని పిలిపించుకుని మరీ... నా గుడిలో మంగళాశాసనం చెప్పి వెళ్ళవా అని పరమాత్మ భక్తుడుతో పాశురం చెప్పించుకున్న పరమ పుణ్య క్షేత్రం.
👉 ఈ స్థలము కంభ రామాయణము రచించిన కవి కంబన్ జన్మ స్థలము. కంబన్ దంపతుల విగ్రహములు ప్రాకరములో ఉన్నవి.
@ మూలవిరాట్ : శ్రీ దేవాదిరాజ పెరుమాళ్
@ ఉత్సవ విగ్రహం : ఆమరువీయప్పన్, భూదేవి శ్రీదేవి సమేతము గా, ఉత్సవ మూర్తి దరిలో అతి సుందరమైన వెండి గోవు దూడ ప్రతిమ ఉన్నది.
@ అమ్మవారు / తాయార్: శెంగమలవల్లి తాయార్.
@ పుష్కరిణి / తీర్థము: దర్శన పుష్కరణి, కావేరి నది.
@ గర్భగుడి విమానము: గరుడ విమానము
👉 తమిళనాడులో మైలాదుత్తురై నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యదేశం కలదు.
అలందురు అని అడగాలి.
🙏తిరుమంగైఆల్వార్ తిరువడిగలే శరణు
🙏శ్రీమతే రామానుజాయ నమః
🙏జై శ్రీమన్నారాయణ !!....
🌹🙏🌹
4 days ago | [YT] | 9
View 0 replies
Load more